Pro Kabaddi League: తమిళ్ తలైవాస్ ఆడిన ‘విధ్వంసం’.. చూస్తే దిమ్మదిరగాల్సిందే

Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ 8లో తమిళ్ తలైవన్ దూసుకుపోతోంది. అద్భుతమైన ఆటతీరుతో విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా హర్యానా స్టలర్స్ తో జరిగిన ఆటలో తలైవన్ గెలవడం సంచలనం సృష్టించింది. నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన మరో మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీని జైపూర్ పింక పాంథర్స్ ఓడించింది. అయితే హర్యానా స్టీలర్స్ తో జరిగిన పోరులో తలైవన్ జట్టు తన ప్రభావం చూపించింది. రెచ్చిపోయి ఆడింది. తలైవన్ దూకుడుకు హర్యానా […]

Written By: Srinivas, Updated On : January 11, 2022 10:17 am
Follow us on

Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ 8లో తమిళ్ తలైవన్ దూసుకుపోతోంది. అద్భుతమైన ఆటతీరుతో విజయాలు నమోదు చేస్తోంది. తాజాగా హర్యానా స్టలర్స్ తో జరిగిన ఆటలో తలైవన్ గెలవడం సంచలనం సృష్టించింది. నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన మరో మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీని జైపూర్ పింక పాంథర్స్ ఓడించింది. అయితే హర్యానా స్టీలర్స్ తో జరిగిన పోరులో తలైవన్ జట్టు తన ప్రభావం చూపించింది. రెచ్చిపోయి ఆడింది. తలైవన్ దూకుడుకు హర్యానా తట్టుకోలేకపోయింది.

Pro Kabaddi League

కెప్టెన్ సుర్జీత్ సింగ్, సాగర్, మంజీత్ అద్భుతంగా ఆడటంతో హర్యానాను ఫస్టాఫ్ లోనే రెండు సార్లు ఆలౌట్ చేసింది. సెకండాఫ్ లో కూడా తలైవన్ తగ్గలేదు. తన సహజమైన ఆట తీరుతో హర్యానాను మళ్లీ ఆలౌట్ చేసి తానేమిటో నిరూపించుకుంది. మ్యాచ్ ను 46-25 తేడాతో నెగ్గింది. దీంతో తలైవన్ జట్టు అప్రతిహ విజయాలను సొంతం చేసుకుంది.

Also Read:  అధిక కొలెస్ట్రాల్ తో బాధ పడుతున్నారా.. కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే చిట్కాలివే!

జైపూర్ పింక్ పాంథర్స్, దబాంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా రికార్డులే నమోదయ్యాయి. 30-28 తేడాతో దబాంగ్ ఢిల్లీపై జైపూర్ పింక్ పాంథర్స్ ఘన విజయం సాధించడం గమనార్హం. దీంతో జైపూర్ జట్టులో దీపక్ హుడా9, కుమార్ 8, అర్జున్ దేశ్వాల్ 7 పాయింట్లు సాధిచి తామేమిటో నిరూపించుకున్నారు.

పాయింట్ల పట్టికలో 32 పాయింట్లతో దబాంగ్ ఢిల్లీ మొదటి స్థానంలో, 29 పాయింట్లతో పాట్నా పైరేట్స్ రెండో స్థానంలో నిలిచాయి. 28 పాయింట్లతో బెంగుళూరు బుల్స్ మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు జట్లు ఐదేసి మ్యాచ్ ల్లో విజయం సాధించాయి.

Also Read:  వైసీపీ ఎమ్మెల్యేపై ఆర్జీవీపై ఫైర్.. ‘వాడిలాంటోళ్లను’..!

Tags