https://oktelugu.com/

Puneeth Rajkumar: భార్యతో ఆస్పత్రికి వెళుతూ.. పునీత్ చివరి క్షణాలు వీడియో వైరల్

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ సినీ ఇండస్ట్రీని కలవరపరిచింది. అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన గుండెపోటుతో మృతి చెందడాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. ఇప్పటికీ కంఠీరవ స్టేడియంలో ఆయన సమాధిని ఇప్పటికీ అభిమానులు దర్శించుకున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో ఏ వీధి చూసినా.. ఏ షాపు చూసినా పునీత్ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎంతో ఆరోగ్యంగా జిమ్ బాడీ చేసుకునే పునీత్ రాజ్ కుమార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2021 / 02:56 PM IST
    Follow us on

    Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కన్నడ సినీ ఇండస్ట్రీని కలవరపరిచింది. అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయన గుండెపోటుతో మృతి చెందడాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు. ఇప్పటికీ కంఠీరవ స్టేడియంలో ఆయన సమాధిని ఇప్పటికీ అభిమానులు దర్శించుకున్నారు.

    puneeth raj kumar

    ప్రస్తుతం కర్ణాటకలో ఏ వీధి చూసినా.. ఏ షాపు చూసినా పునీత్ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఆయనకు ఘన నివాళులర్పించారు. ఎంతో ఆరోగ్యంగా జిమ్ బాడీ చేసుకునే పునీత్ రాజ్ కుమార్ ను ఇలా గుండెపోటు ఇలా బలి తీసుకుంటుందని అభిమానులు రోదిస్తున్నారు.

    అయితే తాజాగా పునీత్ మరణానంతరం ఆయన చివరి ఘడియలకు సంబంధించిన వీడియోలు, ట్వీట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన మరణానికి ముందటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. శుక్రవారం ఒంట్లో నలతగా ఉందని భార్య అశ్వినితో కలిసి పునీత్ రాజ్ కుమార్ ఆస్పత్రికి తన సిబ్బందితో ఆస్పత్రికి బయలుదేరిన వీడియో అంటూ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    రాత్రి పార్టీకి వెళ్లిన పునీత్ ఉదయమే చేశాడు. ఆరోజు జిమ్ చేసిన తర్వాత గుండెల్లో అసౌకర్యంగా ఉందంటూ తన భార్య అశ్వినితో కలిసి ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయలుదేరిన వీడియో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే తానే స్వయంగా కారు వరకు నడుచుకుంటూ వెళ్లారు పునీత్. ఈ వీడియోలో పునీత్ లైవ్ లో కనిపించడం అదే చివరిక్షణాలు..ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పునీత్ ను చూస్తుంటే అందరి కళ్లు చెమ్మగిల్లితున్నాయి. గుండెలు బరువెక్కుతున్నాయి.