Homeజాతీయ వార్తలుSingareni: సింగరేణి ప్రైవేటీకరణ.. వాస్తవాలు!

Singareni: సింగరేణి ప్రైవేటీకరణ.. వాస్తవాలు!

Singareni
Singareni

Singareni: సింగరేణి తెలంగాణలో అతిపెద్ధ ప్రభుత్వరంగ సంస్థ. టర్నోవర్‌లో దేశంలోని నవరత్న కంపెనీలతో పోటీపడుతూ ఏటా మంచి లాభాలతో ముందుకు వెళ్తోంది. అయితే.. ఈ సంస్థ ప్రైవేటీకరణ అంశం కొన్ని రోజులుగా చర్చనీయాంశమౌతోంది. కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ చేయలేమని కేంద్రం చెబుతోంది. ఇటీవల ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రారంభోత్సవం కోసం రామగుండం వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించమని స్పష్టం చేశారు. కానీ, బొగ్గు బ్లాకుల వేలం మాత్రం ఆగడం లేదు. దీంతో తాజాగా ఏప్రిల్‌ 8న మోదీ పర్యటన నేపథ్యంలో సింగరేణి ప్రైవేటీకరణపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పిలుపు నిచ్చింది.

ఎవరిది నిజం..
నల్ల బంగారానికి నెలవైన సింగరేణి సంస్థలో రాష్ట్ర వాటా 51శాతం కాగా.. కేంద్రం వాటా 49 శాతం. రాష్ట్ర ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం అసాధ్యం ఇక్కడి వరకు వాస్తవం. మరి కేంద్రం ప్రైవేటీకరిస్తోంది. వేలం నిర్వహిస్తోంది కదా అంటే.. దానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోంది. ప్రైవేటీకరణ బిల్లుకు పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ అనుకూలంగా ఓటు వేసింది.

2015లో ఎంఎండీ యాక్ట్‌..
బొగ్గు గనుల వేలం విషయంలో కేంద్రం మై¯Œ ్స అండ్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 2015ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అప్పుడు కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు ఉన్న బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌.. ఈ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్‌లో ఓటు వేసింది. బీఆర్‌ఎస్‌ ఎంపీలు 14 మంది.. నాడు ఎంపీగా ఉన్న కవితతోపాటు అందరూ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఎంఎండీ యాక్ట్‌ చట్టరూపం పొందింది. 2020లో కమర్షియల్‌ మైనింగ్‌ అంశాన్ని చట్టంలో చేర్చారు. దీని ప్రకారమే ఇప్పుడు కేంద్రం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

రాష్ట్రం మద్దతు ఉన్నట్లే..
సింగరేణి ప్రైవేటీకరణకు తాము వ్యతిరేం అని గగ్గొలు పెడుతున్న బీఆర్‌ఎస్‌ నాడు ఎందుకు మద్దతు తెలిపిందో చెప్పడం లేదు. కేవలం రాజకీయ అవసరాల కోసం తాముమద్దతు ఇచ్చిన విషయాన్ని దాచి కేంద్రమే ప్రైవేటీకరిస్తోందని ఆరోపిస్తోంది. కేంద్రం కూడా ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతోనే తాము సింగరేణిని ప్రైవేటీకరించే అవకాశం ఉంటుందని స్పష్టంచేస్తోంది.

Singareni
Singareni

పనిస్థలాలు కూడా ప్రైవేటుకు..
ఇదిలా ఉంటే.. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపై గగ్గోలుపెడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. సంస్థలో పని స్థలాలను కూడా ప్రైవేకు అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలోని కాంట్రాక్టులన్నీ ఆంధ్రా కంపెనీలకు అప్పగిస్తోంది. కానీ ఈ విషయాన్ని ఎక్కడా బటయకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగాలే ఉండన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దానికి విస్మరించి సింగరేణిలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ విషయం ఎందుకు బయటకు రావడం లేదంటే.. సింగరేణి కేవలం నాలుగు ఉమ్మడి జిల్లాలకే పరిమితమై ఉండడం, లాభాలు ఏటా పెరుగుతండడంతో ప్రైవేటీకరణ అంశాన్ని ఎవరూపట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు సింగరేణిలో 60 వేల మంది పర్మినెంట్, 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సింగరేణిలో పర్మినెంట్‌ ఉద్యోగుల సంఖ్య 40 వేలకు పడిపోయింది. అదే సమయంలో ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య 40 వేలకు పెరిగింది. సింగరేణి నిబంధనలు, కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు కార్మికులు తెలంగాణ రాకముందు వరకు పనిస్థలాల్లోకి అనుమతించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పనిస్థలాల్లోకి కూడా కాంట్రాక్టు కార్మికులను అనుమతి ఇచ్చేలా నిబంధనలను మార్చేశారు. ఇవన్నీ ప్రైవేటీకరణకు సంకేతాలే. ఇవన్నీ రాష్ట్రప్రభుత్వం చేస్తూ.. నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడం ద్వారా సింగరేణి ప్రైవేటీకరణ అయిపోతుందని ఆందోళనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ వేలంలో సింగరేణి పాల్గొంటే నాలుగు బ్లాకులు సింగరేణికే దక్కుతాయి. అప్పుడు ప్రైవేటీకరణ ముచ్చటే ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే అన్ని రంగాలనూ ప్రైవేటుకు అప్పగిస్తూ పోతోంది. ఈ వాస్తవాలు తెలియని తెలంగాణ ప్రజలు కేంద్రమే ప్రైవేటీకరిస్తోందని నమ్మేలా, నమ్మించేలా బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు పిలుపునిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular