spot_img
Homeజాతీయ వార్తలుModi vs KCR: కేసీఆర్‌ కాస్కో.. తేల్చుకుందామా.. పోటీకి సై అంటున్న మోదీ

Modi vs KCR: కేసీఆర్‌ కాస్కో.. తేల్చుకుందామా.. పోటీకి సై అంటున్న మోదీ

Modi vs KCR: కయ్యానికైనా.. వియ్యానికైనా సమ ఉజ్జీలు ఉంటే చూడ ముచ్చటగా ఉంది. కానీ, పులిని చూసి అడవిలో జంతువులన్నీ భయపడుతున్నాయి కాబట్టి చారలు పెట్టుకుంటే తనను చూసి కూడా జంతువులు భయపడాలని ఒళ్లంతా చారలు పెట్టుకుందట గుంటనక్క. అచ్చం ఇలాగే ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీరు. నరేంద్ర మోదీకి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే ప్రధాని అయ్యాడు. అపరిమితమైన కీర్తి పొందుతున్నాడు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తున్నాడు. విశ్వగురువుగా కీర్తించబడుతున్నాడు. తాను కూడా ముఖ్యమంత్రిగా చేశాను. ప్రధాని అయ్యే అర్హత నాకు కూడా ఉందనుకున్నాడు కేసీఆర్‌. అర్హత ఉండొచ్చు.. మెరుగైన పాలన అందిచొచ్చు. హిందీ బాగా మాట్లాడొచ్చు. కానీ ఎదుటివారిని గౌరవించే తత్వం ఉండాలి. అది కే సీఆర్‌లో ఏ కోణంలోనూ పించదు.. హోదాతో, పదవితో సంబంధం లేకుండా ప్రత్యర్థి అనుకున్నవాడిని ఏక వచ్చనంతో మాట్లాడం, దూషించడం కేసీఆర్‌ సహజ స్వభావం. అందుకే ఆయన జాతీయ పార్టీ పెట్టినా ఆయనతో కలిసి పనిచేయడానికి దేశంలో ఏ పార్టీ ముందుకు రావడం లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి రాజకీయంలో.. కానీ కేసీఆర్‌ ఎజెండా మోదీని గద్దె దించడం ఒక్కటే.

Modi vs KCR
Modi vs KCR

సమరానికి సై అంటున్న మోదీ..
కరెక్టు మొగుడు దొరికితే ఎంతటి గయ్యాలి అయినా అనిగిమణిగి ఉండాల్సిందే. తానే రాజయ చతురుడిని అని భావించే కేసీఆర్‌కు కరెక్టు మొగుడు దొరికాడు. ఇన్నాళ్లూ కేసీఆర్‌ విద్యలన్నీ చూస్తూ పిల్లలకాకిపై ఉండేలు దెబ్బ ఎందుకు అన్నట్లు ఊరుకున్న మోదీ సహనానికే కేసీఆర్‌ పరీక్ష పెడుతున్నాడు. దీంతో సమ ఉజ్జీజ కాకపోయినా మోదీ కూడా సమరానికి సై అన్నట్లు తెలుస్తోంది. దక్షినాది పాగా వేయాలని చూస్తున్న కమలనాథులు.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకు బ్రహ్మాస్త్రమే ప్రయోగించబోతున్నారు.

తెలంగాణ నుంచే మోదీ పోటీ..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రధాని మోదీ తెలంగాణ నుంచి స్వయంగా లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల టాక్‌. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో రాష్ట్రంలో ఇటీవలే జరిగిన సీక్రెట్‌ సర్వేలో సానుకూల అభిప్రాయాలే వచ్చాయని, త్వరలో సెకండ్‌ ఫేజ్‌ స్టడీ కూడా ఉండనున్నదని, ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.

దక్షిణాదికి వరాలు…
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రాజెక్టులను, నిధులను మంజూరు చేస్తుంది. స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు డెవలప్‌మెంట్‌ యాక్టివిటీస్‌లు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే తమిళనాడులోనూ పార్టీ స్ట్రాంగ్‌ అవుతున్నదనే ధీమా వ్యక్తమవుతోంది. దక్షిణాదిలో కర్నాటక మినహా మరెక్కడా అధికారంలో లేని బీజేపీ తెలంగాణలో గెలిచి సౌత్‌ ఇండియాకు ‘గేట్‌ వే’గా మలుచుకోవాలనుకుంటోంది. ఇందుకోసం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ నుంచి స్వయంగా ప్రధాని మోదీ పోటీ చేయడం ద్వారా అన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు గట్టి మెసేజ్‌ పంపడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దోహదపడుతుందన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది.

మహబూబ్‌నగర్‌పై స్పెషల్‌ ఫోకస్‌
తెలంగాణలో దీర్ఘకాలం నుంచి బీజేపీకి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గట్టి పట్టు ఉంది. పార్టీ శ్రేణులు, యాక్టివిటీక్‌ కూడా ఎక్కువే. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి వాజ్‌పేయి హయాంలో(1999–2004) జితేందర్‌రెడ్డి బీజేపీ టికెట్‌ మీద గెలిచారు. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నం శ్రీనివాసరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనతాపార్టీలో ఉన్న టైమ్‌లో రెండు సార్లు జైపాల్‌రెడ్డి కూడా ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ సైతం ఈ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా ప్రజా సంగ్రామ యాత్ర చేసిన సందర్భంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందనే భావన ఉన్నది.

ర హస్య సర్వే..
మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితితో పాటు మోదీ పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం జిల్లా, రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై ఫస్ట్‌ రౌండ్‌ సర్వే సీక్రెట్‌గానే జరిగింది. తెలంగాణ నుంచి మోడీ పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లయితే అది మహబూబ్‌నగర్‌ నుంచే పోటీ చేసే అవకాశముంది. ఈ జిల్లాకు చెందిన జితేందర్‌రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచినా ఇప్పుడు బీజేపీలో ఉండడంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ కూడా ఈసారి పార్టీకి కలిసొస్తుంది. ఈ జిల్లాకు చెందిన డీకే.అరుణ ఇప్పటికే పార్టీకి జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్నారు. మోడీ పోటీ చేయడం ఖరారైతే యావత్తు పార్టీ యంత్రాంగం భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా పని చేస్తుందని అనుకున్నట్టు తెలిసింది.

త్వరలో సెకండ్‌ ఫేజ్‌ సర్వే !
ఫస్ట్‌ రౌండ్‌ సర్వేలో ఏ నియోజకవర్గం మోదీకి సూటబుల్‌గా ఉంటుంది?.. పార్టీ బలం, బలహీనతలేంటి?.. గెలుపుపై అనుమానం లేనప్పటికీ మోదీ ప్రభావం అసెంబ్లీ సెగ్మెంట్లపైనా, రాష్ట్రంపై ఏ మేరకు ప్రభావం చూపి పార్టీకి అనుకూలంగా మారుతుంది?.. ఇలాంటి అంశాలనే ప్రామాణికంగా తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అమిత్‌షా పర్యవేక్షణలో జరిగిన ఈ సర్వే వివరాలను ప్రధానితో కూడా పంచుకున్నట్లు తెలిసింది. తొలుత ఒడిశా నుంచి పోటీ చేయాలని అనుకున్నా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేయడంతో పాటు అసెంబ్లీ, పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచడాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ, తమిళనాడు గురించే చర్చించినట్లు సమాచారం. ఇక, సెకండ్‌ ఫేజ్‌లో మాత్రం మోదీ పోటీ చేయడం ద్వారా పడే ప్రభావంతో ఏ రాష్ట్రంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకోడానికి దోహదపడుతుంది?.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న నాలుగు స్థానాలు డబుల్‌ డిజిట్‌ దాటడానికి పరిస్థితి ఏ మేరకు అనుకూలంగా మారుతుంది?.. వంటి విషయాలపై అధ్యయనం జరగనుంది.

Modi vs KCR
Modi vs KCR

గతంలోనూ ప్రధానుల పోటీ..
గతంలో ప్రధానులుగా పని చేసిన ఇందిరాగాంధీ మెదక్‌ నుంచి పోటీ చేశారు. పీవీ నర్సింహారావు హన్మకొండ, నంద్యాల నుంచి పోటీ చేశారు. బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్‌ బళ్లారి నుంచి పోటీ చేశారు. కర్నాటక నుంచి మోదీ పోటీ చేయడంపై చర్చ జరిగినా అక్కడ ఎలాగూ బీజేపీ అధికారంలో ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయన్నది పార్టీ భావన. పార్లమెంట్‌ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు తర్వాత స్పష్టత రానున్నది.

మొత్తాని ప్రధాని మోదీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాజకీయ యుద్ధానికి సై అంటున్నట్లు కమలనాథులు సంకేతం ఇస్తున్నారు. అదే జరిగితే కేసీఆర్‌ ప్రధాని కావడం ఏమో కానీ, తెలంగాణలో కూడా ఉంటాడో ఊడతాడో తెలియని పరిస్థితి. అట్లుంటది మరి మోదీతో పెట్టుకుంటే !!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version