Pre Wedding Shoot In GYM: ఏముందిరా భయ్.. ఈమెను చేసుకోబోయేవాడికి అది కావాల్సిందే

సోషల్ మీడియాలో నిత్యం కొన్ని విభిన్న వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి వెరైటీ వీడియో ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఓ అమ్మాయి పెళ్లి కూతురు గెటప్ లో జిమ్ సెంటర్ వచ్చి డంబెల్స్ తీసుకొని వ్యాయామం చేస్తూ ఉంటుంది.

Written By: Srinivas, Updated On : May 22, 2023 5:04 pm

Pre-Wedding Shoot In GYM

Follow us on

Pre-Wedding Shoot In GYM: పెళ్లి చేసుకునే వధూ వరులు ఎక్కడుంటారు? మహా అయితే పెళ్లి మండపంలో.. లేదా ఇళ్లల్లో.. లమ్ మ్యారేజేస్ అయితే గుళ్లల్లో.. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు.. ఆడంబరంగా పెళ్లి జరుపుకునేందుకు కొత్త జంటలు ముస్తాబవుతూ ఉంటారు. స్నేహితులు, బంధువుల మధ్య సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ హడావుడి చేస్తుంటారు. కానీ ఓ పెళ్లి కూతురు జిమ్ సెంటర్లో కనిపించింది. అంతేకాదు అక్కడున్న ఐటెమ్స్ తీసుకొని జిమ చేస్తూ కనిపించింది. ఇదేం ట్విస్ట్ రా బాబోయ్.. పెళ్లి కూతురు ఇక్కడుందేంటి? అని చాలా మంది ఈ ఫొటోను చూసి ముందు ఆశ్యర్యపోయారు.. ఆ తరువాత నవ్వుకున్నారు.. చివరికి నిజం తెలుసుకొని షాక్ అయ్యారు.. ఇంతకీ పెళ్లి కూతురు జిమ్ సెంటర్ కు ఎందుకు వచ్చినట్లు?

సోషల్ మీడియాలో నిత్యం కొన్ని విభిన్న వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి వెరైటీ వీడియో ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతోంది. ఓ అమ్మాయి పెళ్లి కూతురు గెటప్ లో జిమ్ సెంటర్ వచ్చి డంబెల్స్ తీసుకొని వ్యాయామం చేస్తూ ఉంటుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. పెళ్లి కొడుకును కొట్టడానికి జిమ్ చేస్తుందా? అని కొందరు మెసేజ్ పెట్టారు. మరికొందరు పెళ్లిలో ఏదైనా గొడవ జరిగితే అడ్డుకోవడానికి జిమ్ చేస్తుందా? అని కామెంట్ చేశారు. కానీ అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.

ఇంతకీ ఈ పెళ్లి కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. ఇటీవల ఫ్రీ వెడ్డింగ్ షూట్ పేరిట పెళ్లికి కాబోయే వారు వినూత్న ఫొటోలు దిగుతున్న విషయం తెలిసిందే. ఓ జంట వినూత్నంగా ఆలోచించి ఇలా జిమ్ సెంటర్ కు వచ్చింది. అక్కడ పెళ్లి కూతురు జిమ్ చేస్తున్నట్లు ఫొటో షూట్ చేశారు. ఈ ఫొటోలను కెమెరామెన్ క్యాప్చర్స్ చేయగా.. అక్కడున్న ఒకాయన వీడియో తీసి నెట్లో పెట్టారు. ఇంకేముంది? నెట్టింట్లో ఫుల్ వైరల్ అయింది.

ఈ వీడియోను చూసి ఫ్రీ వెడ్డింగ్ రానా రాను మరింత విచిత్రంగా మారే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు. పెళ్లికి ముందు అందమైన ప్రదేశాల్లో, అందమైన మనుషుల మధ్య ఫొటోలు దిగాల్సి ఉండగా.. ఇలా వెరైటీ అంటూ పిచ్చి ఫొటోలు దిగడం పై కొందరు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ పెళ్లి కూతురు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.

https://twitter.com/HasnaZarooriHai/status/1659530774897467392?s=20