https://oktelugu.com/

Rana Daggubati- Gangavva: రానాకు తాటి కల్లు దావత్ ఇచ్చిన గంగవ్వ… తాగినాక భల్లాలదేవ కిరాక్ డైలాగ్!

రానా గత ఏడాది వరుసగా మూడు చిత్రాలు విడుదల చేశారు. భీమ్లా నాయక్ లో పవన్ తో ఢీ అంటే ఢీ అనే పాత్ర చేశారు. అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ లో రానా పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. భీమ్లా నాయక్ మంచి విజయం సాధించింది. అయితే ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన విరాటపర్వం నిరాశపరిచింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విరాటపర్వం చిత్రాన్ని వేణు ఉడుగుల తెరకెక్కించారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 22, 2023 / 05:11 PM IST

    Rana Daggubati- Gangavva

    Follow us on

    Rana Daggubati- Gangavva:  హీరో రానా తాటికల్లు తాగారు. గంగవ్వ రానాకు స్వయంగా పల్లెటూళ్ళో దావత్ ఇచ్చారు. ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పల్లెటూరి లైఫ్ వేరు. దాన్ని ఇష్టపడే సెలబ్రిటీలు ఎందరో ఉంటారు. దగ్గుబాటి హీరో రానా స్వయంగా పల్లెటూరికి పోయారు. తాటి కల్లు తాగారు. మై విలేజ్ షో టీమ్ రానాకు ఈ దావత్ ఏర్పాటు చేశారు. తాటి ముంజెలు తినిపించి, కల్లు తాగించారు. రానా తాటాకు రేఖ పట్టగా గంగవ్వ కుండలో కల్లు నేరుగా పోసింది. తాగినాక, కిక్ ఎక్కిందా? అని అడగ్గా… ‘బాసు మనకు ఎక్కడానికి చాలా టైం పడుతుందని’ రానా చెప్పాడు.

    నాకు గంగవ్వ దావత్ ఇచ్చిన ఫోటోలు, వీడియోలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పరేషాన్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కింది. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రానా విలేజ్ కి వెళ్లారు. ఆ చిత్ర టీమ్ కి సపోర్ట్ చేశారు. మసూద ఫేమ్ తిరువీర్ హీరోగా దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్ తెరకెక్కించారు. విలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథకు వినూత్నంగా ప్రమోషన్స్ కల్పిస్తున్నారు.

    ఇక రానా గత ఏడాది వరుసగా మూడు చిత్రాలు విడుదల చేశారు. భీమ్లా నాయక్ లో పవన్ తో ఢీ అంటే ఢీ అనే పాత్ర చేశారు. అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ లో రానా పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. భీమ్లా నాయక్ మంచి విజయం సాధించింది. అయితే ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన విరాటపర్వం నిరాశపరిచింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విరాటపర్వం చిత్రాన్ని వేణు ఉడుగుల తెరకెక్కించారు.

    మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది కానీ… కమర్షియల్ గా ఆడలేదు. రానా మరో కొత్త చిత్రానికి సైన్ చేయలేదు. కారణం తెలియదు కానీ ఆయన గ్యాప్ తీసుకున్నారు. దర్శకుడు గుణశేఖర్ తో హిరణ్య కసిప టైటిల్ తో భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. శాకుంతలం డిజాస్టర్ కాగా ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్లే. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. రానా అభిమానులు ఆయన కొత్త చిత్ర ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.