Avatar 2: గత ఏడాది విడుదలైన ‘అవతార్ 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతాలు మామూలివి కాదు. మొదటి రోజు ఈ సినిమాకి కాస్త నెగటివ్ టాక్ వచ్చింది. దీనితో ఈ చిత్రానికి అవతార్ రేంజ్ లో వసూళ్లు వస్తాయని అనుకోలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వుద్ది ఏమో అన్ని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ మూవీ రన్ ఇప్పటికీ ఆగలేదు. ఇప్పటి వరకు 2.4 బిలియన్ డాలర్స్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు 3 బిలియన్ వైపు పరుగులు తీస్తుంది.
అయితే బాక్స్ ఆఫీస్ రన్ నడుస్తున్నప్పుడే ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చెయ్యడానికి సిద్ధం అయ్యారు.దానికి సంబందించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము. ఈ సినిమాని ఈ నెల 28 వ తారీఖున ఓటీటీ లో విడుదల చెయ్యబోతున్నారు.
ఈ సినిమా ఈనెల 28 వ తారీఖున ఎనీ వేర్,యాపిల్ టీవీ,ప్రైమ్ వీడియో,ఊడు,ఎక్స్ ఫినిటీ,గూగుల్ ప్లే,ఏఏంసి,మైక్రో సాఫ్ట్ వంటి ఓటీటీ చానెల్స్ లో అందుబాటులోకి రానుంది. అయితే ఇది ఉచితంగా మాత్రమే కాదు, ఈ సినిమా అద్దె రూపం లో ఓటీటీ లో అందుబాటులోకి రానుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని చూడాలంటే 20 అమెరికన్ డాలర్లు చెల్లించాలి. అంటే 1600 రూపాయిలు అన్నమాట.
ఈ మూవీ ని ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే 48 గంటల్లో చేసుకోవచ్చు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మాత్రమే మీ డబ్బులు వేస్ట్ అయ్యినట్టే. 28 వ తేదీ ఉదయం 9:30 నిమిషాలకు
ఈ సినిమా అందుబాటులో రానుంది.