Prabhas – Prashant Neel : ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మరో సినిమా..ఈసారి పౌరాణిక కథతో రాబోతున్నారా?

Prabhas – Prashant Neel : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలాంటి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి సిరీస్ తో ప్రారంభమైన ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ డమ్ ఇప్పుడు ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆయన KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ […]

Written By: NARESH, Updated On : April 12, 2023 8:13 pm
Follow us on

Prabhas – Prashant Neel : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలాంటి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి సిరీస్ తో ప్రారంభమైన ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ డమ్ ఇప్పుడు ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆయన KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల కాబోతుంది.ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కబోతుందని గత కొంత కాలం గా సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.ఇది కాసేపు పక్కన పెడితే ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా కూడా రాబోతుందని అంటున్నారు విశ్లేషకులు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తాడని తెలుస్తుంది.

సలార్ చిత్రం పూర్తి అవ్వగానే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడు.ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాతే ప్రభాస్ – దిల్ రాజు ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడని తెలుస్తుంది.ఈ ప్రాజెక్ట్ పౌరాణికం మీద ఉండబోతుందట.యాక్షన్ మూవీస్ తీసే ప్రశాంత్ నీల్ పౌరాణిక సబ్జెక్టు ని ఎలా డీల్ చెయ్యగలడు అనే సందేహం అభిమానుల్లో ఉంది, కానీ టాలెంటెడ్ డైరెక్టర్స్ కి జానర్ తో పని లేదని, ఎలాంటి సబ్జెక్టు ని అయినా డీల్ చేయగలరని, అభిమానులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాలంటే ప్రభాస్ పుట్టినరోజు వరకు వేచి చూడాల్సిందే.ప్రస్తుతం ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ‘ఆది పురుష్’.జూన్ 16 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా తర్వాతే సలార్ కి సంబంధించిన అప్డేట్ వస్తుందని అంటున్నారు.