Prabhas Financial Problem: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పుడు అందరికంటే పెద్ద పాన్ ఇండియన్ స్టార్ ఎవరు అంటే టక్కుమని మన అందరికి గుర్తుకు వచ్చే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సిరీస్ తో ఆయన క్రేజ్ ఏ రేంజ్ కి ఎగబాకిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ప్రస్తుతం అందరి సూపర్ స్టార్స్ కంటే అత్యధిక పారితోషికం తీసుకుంటుంది కూడా ఆయనే..ఒక్కో సినిమాకి దాదాపుగా వంద నుండి 150 కోట్ల రూపాయిల వరకు తీసుకుంటున్నాడు.

అయితే ప్రభాస్ ఒకప్పుడు అప్పులలో చిక్కుకొని చాలా ఇబ్బందులు పడినట్టు ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా తెలిసిందే..ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ ఎపిసోడ్ నిన్న రాత్రి నుండి ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అవుతుంది..తొలుత ఈ ఎపిసోడ్ అప్లోడ్ చెయ్యగానే ప్రభాస్ ఫ్యాన్స్ తాకిడికి తట్టుకోలేక ఆహా యాప్ క్రాష్ అయ్యింది..చాలాసేపటి వరకు యాప్ లైవ్ అవ్వలేదు..ఆ తర్వాత యాప్ లో కొన్ని కీలకమైన మార్పులు చేసి మరోసారి అప్లోడ్ చేసారు.
ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తన అప్పుల గురించి చెప్పుకొచ్చాడు..’బాహుబలి సినిమాకి ముందు నాకు చాలా అప్పులు ఉండేవి..అవి తట్టుకోలేక కొన్ని సినిమాలు కమిట్ అవ్వాల్సి వచ్చింది..అలా కమిట్ అయినా సినిమానే మిర్చి..ఛత్రపతి సినిమా తర్వాత రాజమౌళి నాతో సినిమా చెయ్యాలని చాలా సార్లు అనుకున్నాడు..బాహుబలి స్టోరీ తో నా దగ్గరకు, వెంటనే ఒప్పేసుకున్నాను..కానీ దానికి ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాలన్నాడు..నాకేమో అప్పులు భారీగా ఉన్నాయి..బాహుబలి అప్పుడే స్క్రిప్ట్ దశలో ఉంది.

అప్పుడు రాజమౌళి ని వెళ్లి ఇలా నాకు అప్పులు ఉన్నాయి..మిర్చి సినిమా చేసుకొస్తాను..ఫర్వాలేదా..అని అడిగాను..స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి ఎలాగో బాగా టైం పడుతుంది కాబట్టి నువ్వు చేసుకొని రా అని రాజమౌళి అన్నాడు’ అంటూ ప్రభాస్ బాలయ్య తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇది చూసిన తర్వాతే అర్థం చేసుకోవచ్చు..ప్రతి మనిషి అప్పు నుండి తప్పించుకోలేరు అనేది.