Unstoppable With Nbk- Prabhas: ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 2 లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు అనే విషయం అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో గ్లిమ్స్ ని విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మెయిన్ ప్రోమో ని ఎప్పుడు విడుదల చెయ్యబోతున్నారు అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ తో ఆడుకుంటుంది ఆహా మీడియా టీం.

ప్రోమోనే ఇంత ఆలస్యం గా విడుదల చేస్తే ఇక ఫుల్ ఎపిసోడ్ ని ఎప్పటికి విడుదల చేస్తారో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు..ప్రతీ ప్రొడక్షన్ హౌస్ మాతో ఆడుకునేవాళ్లే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు..ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటుగా ఆయన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా పాల్గొన్నాడు..వీళ్ళిద్దరితో పాటు మధ్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వీడియో కాల్ ద్వారా కాసేపు చిట్ చాట్ చేసాడు.
అయితే ఈ ఎపిసోడ్ గురించి ఇప్పుడొక్క లేటెస్ట్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కాస్త ఉపశమనం కలిగించింది..అదేమిటంటే ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31 వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది..ఎన్నో హైలైట్స్ తో నిండిపోయిన ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు..ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఎప్పుడూ తక్కువగా మాట్లాడే ప్రభాస్ ఇలాంటి టాక్ షోస్ లో ఎలా మాట్లాడబోతున్నాడు.

ఆయన చెయ్యబొయ్యే అల్లరి ఎలా ఉండబోతుంది..బాలయ్య బాబు ప్రభాస్ ని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నాడు, ఇలాంటివన్నీ ప్రేక్షకుల్లో బాగా ఆసక్తిని కలిగించింది..అయితే ఈ ఎపిసోడ్ కోసం ఇంకా రెండు వారాలు వెయిట్ చెయ్యాలా అని ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతూనే, మరోపక్క కనీసం డేట్ అయినా తెలిసింది సంతోషం అని అనుకుంటున్నారు..ఇక మెయిన్ ప్రోమో కోసం కూడా వచ్చే వారం వరుకు ఎదురు చూడాల్సిందే.