
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీరికలేని జీవితం గడుపుతున్నారు. అటు ప్రజాసేవ చేస్తూ… దానికి కావలసిన సినిమా వృత్తిని కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల వరుస చిత్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఒప్పుకున్న చిత్రాలను త్వరితగతిన ఆయన పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు చిత్రాలు షూటింగ్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. వినోదయ సితం రీమేక్ కొంత మేర షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి తక్కువ. సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 20-25 రోజులు మాత్రమే కేటాయించారట.
అలాగే దర్శకుడు హరీష్ శంకర్ తో ప్రకటించిన ఉస్తాద్ భగత్ షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ 8 రోజుల్లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ నందు హీరోయిన్ శ్రీలీల సైతం పాల్గొన్నారు. హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాలు, కొన్ని కామెడీ సీన్స్ తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేశారట. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో రూపొందించిన ఈ ఫైట్ లో వంద మంది ఫైటర్స్ పాల్గొన్నట్లు సమాచారం.

ఒక ఉస్తాద్ నెక్స్ట్ షెడ్యూల్ గ్యాప్ లో ఓజీ లైన్లోకి తెచ్చారు. నేడు ఓజీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్స్ సమాచారం ఇచ్చారు. ఓజీ సెట్స్ కి వస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటో విడుదల చేశారు. సూపర్ హ్యాండ్సమ్ లుక్ లో పవన్ కళ్యాణ్ కేక పుట్టించారు. ఆయన లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. సాహో ఫేమ్ సుజీత్ వర్మ ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. మాఫియా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఓజీ తెరకెక్కిస్తున్నారు.
ఓజీ అనగా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం అట. గ్యాంగ్ స్టర్స్ ని ఒణికించే వాడిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుందట. పోస్టర్ తో అంచనాలు పెంచిన సుజీత్… ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియోతో గూస్ బంప్స్ తెప్పించారు. ఫ్యాన్స్ కోరుకున్న దానికంటే పది రెట్లు మిన్నగా పవన్ కళ్యాణ్ ని సిల్వర్ స్క్రీన్ మీద ఆయన ప్రజెంట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఓజీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారం అవుతుంది.
THE #OG HAS ARRIVED on sets… 🔥🔥🔥#PawanKalyan #TheyCallHimOG #FireStormIsComing@PawanKalyan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing 🔥#𝙏𝙝𝙚𝙮𝘾𝙖𝙡𝙡𝙃𝙞𝙢𝙊𝙂💥 pic.twitter.com/Qv9K9ito4Q
— DVV Entertainment (@DVVMovies) April 18, 2023