
Pawan Kalyan – Sai Dharam Tej Movie: ‘ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఈ ఏడాది జులై 28 వ తారీఖున విడుదల చెయ్యబోతున్నట్టు గత కొద్ది రోజుల క్రితమే అధికారికంగా నిర్మాతలు ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. కేవలం ఒక్క సాంగ్ షూటింగ్ బ్యాలన్స్ మాత్రమే ఉంది.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహించాడు.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించగా,హీరోయిన్స్ గా కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ టైం గాడ్ ప్రాత్రలో నటిస్తున్నాడు. ఆయన లుక్స్ ఇప్పటికే సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది.
చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మోస్ట్ స్టైలిష్ లుక్స్ తో ఈ సినిమాలోనే కనిపించబోతున్నాడు.అయితే ఇందులో పవన్ కళ్యాణ్ కి సంబంధించి ‘నేనే కాలాన్ని’ అనే డైలాగ్ ఉంటుందట. దీనినే సినిమాకి టైటిల్ గా పెట్టబోతున్నారని టాక్. ఇటీవలే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి ఈ టైటిల్ సజెస్ట్ చెయ్యగా, ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

ఏప్రిల్ 26 వ తారీఖున టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని టాక్.గతం లో ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్ పెడతారని సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారమయ్యేది. అయితే ఆ టైటిల్ ని వేరే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు రిజిస్టర్ చేయించుకున్నారు. అందుకే ఈ టైటిల్ కి ఫిక్స్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.మరి పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో కి ఇలాంటి టైటిల్ పెడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.