Veerasimha Reddy : ‘అఖండ’ వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ‘వీర సింహా రెడ్డి’..సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి..బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లో ఉండడం తో పాటు టీజర్ మరియు పాటలు జనాల్లోకి బాగా రీచ్ అవ్వడం వల్ల అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక నిన్న విడుదల చేసిన ‘మా భావ మనోభావాలు’ పాటకి కూడా అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..వింటేజ్ బాలయ్య నుండి అభిమానులు ఏవైతే కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో పెట్టాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని..శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది..ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో చివరి పాట చిత్రీకరణ జరుగుతుంది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియా లో నేడు ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..జనవరి 6 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒంగోలు లో జరగబోతుందని..ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నాడని తెలుస్తుంది..ఇటీవలే పవన్ కళ్యాణ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో బాలయ్య ని కలిసి ఒక 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపాడు.
ఈ నెల 27 వ తారీఖున ఆయన ఆహా మీడియా లో బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 2 చివరి ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు..రేపు అధికారిక ప్రకటన కూడా రాబోతుంది..ఈ ఎపిసోడ్ తర్వాత మరోసారి బాలయ్య బాబు తో కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించబోతుండడం నిజం గా మెగా మరియు నందమూరి అభిమానులకు కనుల పండుగే అని చెప్పొచ్చు.