Ustad Bhagat Singh: పోలీస్ గెటప్ లో పవర్ స్టార్..’ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు షూటింగ్ విశేషాలు ఇవే!

Ustad Bhagat Singh: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రారంభం అయ్యింది. ఇందుకోసం వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో నేడు పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. పోలీస్ గెటప్ లో నేడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. సుమారుగా పది రోజుల పాటు […]

Written By: Vicky, Updated On : April 5, 2023 4:57 pm
Follow us on

Ustad Bhagat Singh

Ustad Bhagat Singh: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ప్రారంభం అయ్యింది. ఇందుకోసం వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో నేడు పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. పోలీస్ గెటప్ లో నేడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.

సుమారుగా పది రోజుల పాటు విరామం లేకుండా సాగబోతున్న ఈ చిన్న షెడ్యూల్ లో హీరోయిన్ శ్రీలీల కూడా పాల్గొనబోతుందని టాక్. ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు,ఒకరు శ్రీలీల కాగా మరొకరి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. చాలా మంది ఈ చిత్రాన్ని రీమేక్ అని తెగ హడావుడి చేస్తున్నారు కానీ, వాస్తవానికి ఈ చిత్రం రీమేక్ కాదని డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.

తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన విజయ్ ‘తేరి’ మూవీ స్టోరీ లైన్ ని మాత్రమే తీసుకొని, కథ మొత్తాన్ని మార్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాగ ఉండేట్టు ఈ సినిమా స్క్రిప్ట్ ని తయారు చేసాడట డైరెక్టర్ హరీష్ శంకర్. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ గానూ మరియు పోలీస్ ఆఫీసర్ గాను కనిపించబోతున్నాడు.

Ustad Bhagat Singh

గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని మించే విధంగా ఈ సినిమా ఉండబోతుందని, చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందనే నమ్మకం తో ఉంది ట్రేడ్. ఈ ఏడాది లోపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సాన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.