
MS Dhoni: మహేంద్రసింగ్ ధోని.. ఇండియన్ క్రికెట్ లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ వేరు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఎన్నో ఆడిన ధోనీకి.. మంచి ఫినిషర్ అన్న పేరు కూడా ఉంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ విషయానికొస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ కు ధోని సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అప్రతిహత విజయాలతో నాలుగు సార్లు చెన్నైకు ఐపీఎల్ కప్పును అందించాడు ధోని. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లోనే అత్యధిక వయసు ఉన్న క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోనీనే. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ధోని. యువ క్రికెటర్లతో పోటీపడుతూ భారీ షాట్లు కొడుతున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు బాళ్లు ఆడిన ధోని రెండు సిక్సులు కొట్టి అవుట్ అయ్యాడు.
చెన్నై ను గెలిపించిన ఆ రెండు సిక్సులు..
ఈనెల మూడో తేదీన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నై వేదికగా ఆడింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 217 పరుగులు చేసింది. చేజింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు దాటిగానే ఆడడంతో విజయం వైపు సాగింది. అయితే చివరి దశలో తడబాటుకు గురి కావడంతో 205 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పరుగులు తేడాతో లక్నోపై విజయం సాధించినట్లు అయింది. అయితే, ఈ మ్యాచ్ లో ధోని కొట్టిన రెండు సిక్సులు వల్ల వచ్చిన 12 పరుగులు తేడాతో చెన్నై జట్టు విజయం సాధించడంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకున్నట్లు అయింది. ఒకవేళ ధోని ఆ రెండు సిక్సులు కొట్టకపోతే జట్టు ఓటమి పాలయ్యేదన్న భావన సభ్యులతోపాటు అభిమానుల్లోనూ వ్యక్తం అయింది. ధోని కొట్టిన రెండు సిక్సులు వల్ల ఈ సీజన్లో చెన్నై జట్టు మొదటి విజయాన్ని నమోదు చేసుకుంది.
శుభారాంబాన్ని అందించిన ఇరు జట్ల ఓపెనర్లు..
చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వాయ్ 9 ఓవర్లలోనే 110 పరుగులను జట్టుకు అందించారు. 32 బంతుల్లో గైక్వాడ్ 57 పరుగులు చేయగా, 29 బంతుల్లో కాన్వాయ్ 47 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన శివమ్ దుబే 16 బంతుల్లో 27 పరుగులు, మొయినలి 13 బంతుల్లో 19 పరుగులు, అంబటి రాయుడు 14 బంతుల్లో 27 పరుగులు, ధోని మూడు బంతులు ఆడి 12 పరుగులు చేశాడు.

దీంతో చెన్నై జట్టు 217 పరుగులు భారీ లక్ష్యాన్ని లక్నో జట్టు ముందు ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు ఓపెనర్లు సుబారంబాన్ని అందించారు. కైల్ మేయర్స్ 22 బంతుల్లోనే 53 పరుగులు సాధించడంతో విజయం దశగా లక్నో జట్టు పైన ఇస్తున్నట్లు కనిపించింది. 5.2 బంతుల్లో 79 పరుగులతో లక్నో జట్టు జోరుగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. మేయర్ అవుట్ అయిన తర్వాత లక్నో జట్టు స్కోరు నెమ్మదించింది. వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో విజయం దిశగా లక్నో జట్టు ప్రయాణం నెమ్మదించింది. అయితే, ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు బ్యాట్ ఝులిపించడంతో లక్ష్యానికి దగ్గరగానే లక్నో జట్టు వచ్చింది. మార్కస్ స్టోయినిస్ 18 బంతుల్లో 21 పరుగులు చేయగా, నికోలస్ పూరన్ అండ్ 18 బంతుల్లో 32 పరుగులు, ఆయుష్ బదోని 18 బంతుల్లో 23 పరుగులు, కృష్ణప్ప గౌతమ్ 11 బంతుల్లో 17 పరుగులు, మార్కువుడ్ మూడు బంతుల్లో పది పరుగులు చేయడంతో లక్ష్యానికి దగ్గరగా వచ్చి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ మ్యాచ్లో చివరి ఓవర్ లో ధోని కొట్టిన 12 పరుగులు తోనే చెన్నై జట్టు విజయం సాధించడం గమనార్హం.