Sri Satya: అందం ఎవరి సొత్తు కాదు..మేం కూడా బ్యూటీ షోతో అదరగొడుతాం అన్నట్లు కొందరు భామలు తమ అందాలను షో చేస్తూ రచ్చ చేస్తున్నారు. సినీ ఎంట్రీ ఇవ్వడానికి సోషల్ మీడియా మంచి వేదికగా నిలుస్తోంది. ఇదే సమయంలో తమ ప్రతిభను చూపించడానికి అవకాశం ఇస్తోంది. దీంతో కొంత మంది భామలు గ్లామర్ షో చేస్తూ ఆకట్టుకుంటున్నారు. లేటేస్టుగా బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య ఆడియన్స్ షాక్ తినేలా బుల్లినెక్కర్లో కనిపించింది. ఇప్పటి వరకు సాంప్రదాయ వేర్ లో కనిపించిన ఈ భామ ఒక్కసారి షార్ట్ డ్రెస్ వేయడంతో యూత్ తట్టుకోలేకపోతున్నారు.
‘నేను శైలజ’ సినిమాతో ఫిల్మ్ రంగంలో అడుగుపెట్టిన శ్రీ సత్య ఆ తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. కానీ ఆ తరువాత బుల్లితెరపై కనిపించి ఆకట్టుకున్నారు. అదృష్టం ఎవరికి ఎక్కడ రాసిదో చెప్పలేం అన్నట్లు.. ఆమెకు టీవీ సీరియళ్లు బాగా కలిసొచ్చాయి. ఆమె నటించిన ముద్దమందారం, నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, త్రినయని వంటి సీరియళ్లు సక్సెస్ అయ్యాయి. దీంతో శ్రీ సత్య పేరు మారుమోగింది. ఇదే క్రమంలో ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోనూ శ్రీ సత్య ఫర్ఫామెన్స్ చూపించింది. అయితే లాస్ట్ మూమెంట్లో ఎలిమినేట్ అయింది.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొచ్చిన తరువాత శ్రీసత్య మరింత ఫేమస్ అయ్యారు. దీంతో ఆమెకు సీరియళ్లలో మంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సీరియళ్లలో సాంప్రదాయ సారీలో కనిపించే ఆమె రియల్ గా జీన్స్ పాంట్, షర్ట్స్ వేసుకొని ఉండడాన్ని చూసి నోరెళ్లబెట్టుకుంటున్నారు. ఓ వైపు సీరియళ్లలో నటిస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించినా గీత దాటలేదు. సాంప్రదాయంగానే కనిపించి అలరించారు.
కానీ లేటేస్టుగా శ్రీసత్య ఇలాంటి గ్లామర్ షో విషయంలో హద్దులు దాటిందని అంటున్నారు. థైస్ కనిపించేలా బుల్లి నెక్కరు వేసుకుని టాప్ లో టైట్ షర్ట్ వేసుకొంది. ఈ షర్ట్ లో ఎద అందాలన్నీ షో చేస్తున్నాయి. బీచ్ పక్కన ఈ భామ ఇలాంటి డ్రెస్ లో కనిపించడంతో కొందరు పిక్స్ తీసుకున్నారు. అవి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతున్నారు. ఊహించని విధంగా శ్రీ సత్య ఇలాంటి డ్రెస్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చర్చించుకుంటున్నారు.