Pope Francis Passes Away: వాటికన్ సిటీ(Vatican City).. ఈపేరు వినగానే అందరికీ గుర్తుకువచ్చేది ప్రపంచంలో అతిచిన్న దేశం. ఇదే సమయంలో క్రైస్తవులు అతి పవిత్రంగా భావించే పోప్ ఉండేది కూడా ఇక్కడే. ఇప్పటి వరకు 266 మంది పోప్‌లు పనిచేశారు. ప్రస్తుతం 266 పోప్‌గా ఉన్న ఫ్రాన్సిస్(88) అనారోగ్యంతో కన్నుమూశారు.
Also Read: రోహిత్ ఘనత.. ముంబై సరికొత్త చరిత్ర.. చెన్నై పై ఎన్ని రికార్డులో?!
క్రై స్తవ మతపెద్ద, 266వ పోప్ ఫ్రాన్సిస్(Fransis)(88) అనారోగ్యంతో కన్నుమూశారు. వాటికన్ సిటీలో సోమవారం మృతి చెందినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్ సందర్భంగా ఆయన పేరిట సందేశం వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. అమెరికా(America) ఖండం నుంచి తొలి పోప్‌గా చరిత్ర సృష్టించిన ఫ్రాన్సిస్, తన మానవతావాద విధానాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
అర్జెంటీనా నుంచి వాటికన్ వరకు
పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనా(Arjenteena)లోని బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించారు. 2013లో పోప్ బెనెడిక్ట్–16 రాజీనామా తర్వాత, మార్చి 13న ఆయన కేథలిక్ చర్చి(Kathalic Charch) అధిపతిగా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి పోప్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా చరిత్రలో స్థానం సంపాదించారు. ఆయన నాయకత్వంలో కేథలిక్ చర్చి సామాజిక సమస్యలపై ప్రగతిశీల వైఖరిని ప్రదర్శించింది.
సామాజిక సంస్కరణలకు కృషి..
పోప్ ఫ్రాన్సిస్ సమకాలీన సామాజిక సమస్యలపై నిర్భీతిగా మాట్లాడారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడారు. 2016లో రోమ్ వెలుపల ఇతర మతాల శరణార్థుల పాదాలను కడిగిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump), కమలా హారిస్(Kamala Harris) వైఖరులను తప్పుబట్టడం కూడా ఆయన స్పష్టమైన వైఖరిని తెలియజేస్తుంది.
అనారోగ్యంతో చివరి రోజులు..
గత కొంతకాలంగా పోప్ ఫ్రాన్సిస్ శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో బాధపడ్డారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టా నివాసంలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఈస్టర్ సందర్భంగా ఆయన సందేశం ఇచ్చిన కొద్ది గంటల్లోనే మరణించడం విషాదకరం. ఈ సందర్భంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆయనను సందర్శించినట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్త సంతాపం
పోప్ ఫ్రాన్సిస్ మృతికి అనేక దేశాధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మానవతావాద దక్పథం, సామాజిక న్యాయం కోసం చేసిన కషి క్రై స్తవ ప్రపంచానికి మాత్రమే కాక, మానవాళికి స్ఫూర్తిగా నిలుస్తాయి. వాటికన్ సిటీలో తదుపరి పోప్ ఎన్నిక ప్రక్రియపై దృష్టి సారించనుంది.
పోప్ ఫ్రాన్సిస్ నాయకత్వం కేథలిక్ చర్చిని సామాజిక సంస్కరణల దిశగా నడిపించింది. ఆయన సరళత, మానవత్వం, నిర్భీత వైఖరి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షించాయి. ఆయన మరణం క్రై స్తవ ప్రపంచానికి తీరని లోటు కాగా, ఆయన సందేశాలు శాంతి, సామరస్యం కోసం మానవాళిని ప్రేరేపిస్తాయి.
Also Read: 14 ఏళ్ల సూర్యవంశీ.. ఐపీఎల్ కోసం ఇంత త్యాగం చేస్తున్నాడా? చప్పట్లు కొట్టాల్సిందే..