Bigg Boss 9 : ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం మన టాలీవుడ్ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఏకైక రియాలిటీ షో ఇది. ఆరంభం లో మన ఆడియన్స్ కి అర్థం కాకపోయినా, అర్థమైన తర్వాత మాత్రం ఈ షోకి అడిక్ట్ అయిపోయారు. ఇప్పటికే 8 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ, ఈ ఏడాది 9వ సీజన్ ని మొదలు పెట్టనుంది. ఆగస్టు నెలాఖరున ఈ సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ సీజన్(Bigg Boss 9 Telugu) కోసం 9 మంది కంటెస్టెంట్స్ ని ఎంచుకున్నారట. వాళ్లెవరో ఒకసారి చూద్దాం. మొదటి నుండి ఈ సీజన్ లో అమర్ దీప్ సతీమణి తేజస్విని గౌడ(Tejaswini Gowda) వస్తుందని ప్రచారం గట్టిగా జరిగింది.
Also Read : ‘బిగ్ బాస్ 9’ లోకి అలేఖ్య చిట్టి..రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో ఇస్తున్నారా!
కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తేజస్విని మాట్లాడుతూ గత సీజన్ లో కూడా తనని ఇంటర్వ్యూ చేసారని, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని, ఈ సీజన్ లో పాల్గొనే అవకాశం లేదని, ప్రస్తుతం తమిళంలో ఒక సీరియల్ చేయబోతున్నాను అని, రాబోయే సీజన్స్ లో కచ్చితంగా పాల్గొంటానని చెప్పుకొచ్చింది తేజస్విని. అయితే ఈమె కాకుండా ఖరారైన కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చూద్దాం. సీరియల్స్ లో విలన్ గా నటించి బాగా పాపులర్ అయ్యి, ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రీతూ చౌదరీ ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతుందట. ఈమె గత సీజన్ లోనే రావాల్సి ఉంది, కానీ తన స్నేహితురాలు విష్ణు ప్రియా కోసం డ్రాప్ అయ్యింది. ఇక ఈ సీజన్ లో పాల్గొనబోయే రెండవ కంటెస్టెంట్ ఉప్పల్ బాలు. సోషల్ మీడియా లో వాడేవాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు ఇది.
అదే విధంగా పలు సినిమాల్లో హీరో గా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ కూడా ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా రాబోతున్నాడు. ఈయన ప్రముఖ నిర్మాత MS రాజు కుమారుడు. సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతోనే బిగ్ బాస్ లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్ 2’ ప్రోగ్రాం నుండి ఏకంగా ఆరు మంది రాబోతున్నారట. అందులో Debjaani modak , జబర్దస్త్ ఐశ్వర్య, ఇమ్మానుయేల్, నిఖిల్, శివ్, సింగర్ సాకేత్ వంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళ నుండి మరో ఇద్దరు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. కేవలం వీళ్ళు మాత్రమే కాకుండా పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారట.