
Pooja Hegde: ప్రస్తుతం యూత్ మొత్తం పూజ హెగ్డే ని ఎంతలా ఆరాధిస్తారో మన అందరికీ తెలిసిందే.ఆమెకి ఉన్న క్రేజ్ ని చూసి ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధం గా ఉంటారు.సౌత్ లో ఆమెకి ఉన్న క్రేజ్ ని చూసి బాలీవుడ్ లో కూడా వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.అక్కడ వరుసగా హృతిక్ రోషన్,సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ ఇలాంటి క్రేజీ స్టార్ హీరోల సరసన నటించిన ఏకైక హీరోయిన్ గా పూజ హెగ్డే సరికొత్త రికార్డు ని నెలకొల్పింది.కానీ చేతికి వచ్చిన ఈ బంగారం లాంటి అవకాశాలన్నీ వృథా అయ్యాయి.
Also Read: WPL 2023 వేలం : స్మృతి, ఎల్లీస్ కు కళ్ళు చెదిరే ధర.. ఆరుగురిలో ముగ్గురు బెంగళూరుకే.. ఎవరికి ఎంతంటే?
ఎందుకంటే ఈ చిత్రాలన్నీ కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.కనీస స్థాయి వసూళ్లను దక్కించుకోలేక పొయ్యాయి ఈ చిత్రాలు.విచిత్రం ఏమిటంటే అసలు ఫ్లాప్ పేరు కూడా తెలియని రోహిత్ శెట్టి కి రీసెంట్ గా అంత పెద్ద డిజాస్టర్ పరిచయం చేసింది కూడా పూజా హెగ్డే లెగ్ అంటూ నెటిజెన్స్ ట్రోల్ల్స్ చేస్తున్నారు.

రణవీర్ సింగ్ – రోహిత్ శెట్టి కాంబినేషన్ గత ఏడాది డిసెంబర్ 23 వ తారీఖున విడుదలైన ‘సర్కస్’ అనే చిత్రం భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.ఫుల్ రన్ లో ఈ సినిమా కనీసం 30 కోట్ల రూపాయిలు కూడా వసూలు చెయ్యలేకపోయింది.ఇంతటి క్రేజీ కాంబినేషన్ ఆ రేంజ్ ఫ్లాప్ అవ్వడానికి కారణం పూజ హెగ్డే లెగ్గు మహిమ,ఆమె హీరోయిన్ గా చెయ్యబట్టే ఆ సినిమా అంత పెద్ద ఫ్లాప్ అయ్యింది అంటూ పూజ హెగ్డే ని సోషల్ మీడియా లో నెటిజెన్లు ట్రోల్ల్స్ చేస్తున్నారు.ఇప్పుడు లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘కేసీ కా భాయ్ కేసీ కా జాన్ ‘ అనే సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది, ఇందులో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించింది.ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే ఫ్లాప్ కల ఉట్టిపడేలా అనిపిస్తుంది.రీసెంట్ గా విడుదల చేసిన వీడియో సాంగ్ బాగా ట్రోల్ అవుతుంది.ఈ సినిమా కూడా నిజంగా ఫ్లాప్ అయితే అయితే ఇక పూజ హెగ్డే కెరీర్ బాలీవుడ్ లో ముగిసినట్టే అనుకోవాలి.
Also Read:Ram Charan- Kiara Advani: కొత్త పెళ్లికూతురు కియారా అద్వానీకి రామ్ చరణ్ సర్ప్రైజ్ గిఫ్ట్!