
Women Working: కుటుంబంలో అందరూ పనిచేస్తేనే ఆ సంసారం సాఫీగా సాగుతుంది. అయితే పని చేయడంలో తేడా ఉంటుంది. ఎక్కువ తక్కువ సమయాలు ఉంటాయి. ఇలా పనిచేసే తీరును ఆధారంగా అహ్మదాబాద్‌లోని ఐఐఎం ప్రొఫెసర్ ఇటీవల ఓ సర్వే చేశారు. ఇందులో పురుషుల కంటే గృహిణులు, ఉద్యోగాలు చేసే మహిళలే ఎక్కువ సమయం పనిచేస్తున్నారని తేల్చారు.
ఇంటి పనులకు 7.02 గంటలు..
సాధారణంగా గృహిణులు ఇంటి పనుల కోసమే 7 గంటల 2 నిమిషాలు పనిచేస్తున్నారని ఈ సర్వేలో తేల్చారు. ఉద్యోగాలు చేసే పురుషులు 8 గంటలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఉద్యోగాలు చేసే పురుషులు ఆఫీస్ పనితోపాటు ఇంటి పనికి 2 గంటలు, ఇతర పనులకు మరో 2 గంటల సమయం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇక ఉద్యోగాలు చేసే స్త్రీల విషాయనికి వస్తే ఆఫీస్‌లో 8 గంటల పనితోపాటు ఇంట్లోనూ పనులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే వీరు బయటి పనిలో తక్కువ భాగస్వాములు అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇక 15 నుంచి 60 ఏళ్లలోపు మహిళలంతా రోజుకు కనీసం 7 గంటలు ఇంటి పనులు చేస్తున్నారని వెల్లడించారు.
విశ్రాంతి లేకుండా..
అయితే ఈ సర్వేలో పురుషులు ఆఫీస్ పనితోపాటు ఇల్లు, ఇతర పనులకు మొత్తం కలిసి 9 గంటలు వెచ్చిస్తున్నట్లు సర్వేలో తేలింది. అయినా పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా పనిచేస్తున్నారని తేల్చారు. వాస్తవంగా ఇళ్లలో చేసే పనికి విశ్రాంతి సమయం ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్‌లో చేసే పనికి విశ్రాంతి ఉండదు. భోజన విరామ సమయం మినహా మిగతా సమయంమంతా పని చేయాల్సిందే. కానీ గృహంతో నచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. ఓపిక లేకపోతే పని మరుసటిరోజుకు వాయిదా వేసుకోవచ్చు. కానీ సర్వేలో కుటుంబ సభ్యుల సంరక్షణ, ఇంటి శుభ్రత, వంట చేయడం వంటి వేతనం లేని పనుల్లో మహిళల 7.02 గంటలు పనిచేస్తున్నట్లు సర్వే తేల్చింది. పురుషుల ఈ పనులు కేవలం 2 గంటలే చేస్తున్నట్లు నిర్ధారించింది. ఇక ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే ఉద్యోగం చేస్తున్న మహిళ రెండు గంటలు అదనంగా పనిచేస్తున్నట్లుల తెలిపారు.

ఓవరాల్‌గా ఈ సర్వే కేవలం గృహిణుల గురించే కానీ, ఇందులో పురుషులు ఉద్యోగంలో 8 గంటలు, బయట పనికి 2 గంటలు, వంట పనులకు మరో 2 గంటలు కేటాయిస్తున్నట్లు ఈ సర్వేలేనే తేల్చారు. గృహిణులు మాత్రం 7.02 గంటలే పనిచేస్తున్నట్లు తెలిపారు. అది కూడా విశ్రాంతి తీసుకుంటూ చేస్తున్నారు. అంటే ఈ సర్వే ప్రకారం పురుషులు 12 గంటలు, స్త్రీలు గంట అటూ ఇటుగా 8 గంటలు పనిచేస్తున్నారు. కానీ సర్వే చేసిన ప్రొఫెసర్ నమ్రతా చిందార్కర్ మాత్రం స్త్రీలే ఎక్కువ పనిచేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. మహిళా పక్షపాత అధ్యయనంగా ఉంది ఈ సర్వే. సర్వే చేసింది కూడా మహిళే కావడంతో ఫలితాలు ఇలా ఉన్నాయని పురుషులు ఈ సర్వేను విమర్శిస్తున్నారు.