
Muthyalareddypally: కొడుకు లేదా కూతురు ఎస్సై అయితే తల్లిదండ్రులు ఎంతో గర్వపడతారు. కొంతమంది వారి పేరు చెప్పి చిన్నచిన్న సెటిల్‌మెంట్లు చేస్తారు. కానీ ఇక్కడ ఓ ఎస్సై తల్లి ఏకంగా బ్రోతల్ హౌస్ నడుపుతోంది. స్థానికుల సమాచారంతో ఆ ఇంటిపై దాడిచేసిన పోలీసులు నిర్వాహకురాలు ఎస్సై తల్లి అని తెలియడంతో స్టన్ అయ్యారు.
తిరుపతిలో ఘటన..
తిరుపతి ముత్యాలరెడ్డిపల్లిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు పోలీసులు పక్కా సమాచారం అందడంతో పోలీసులు హౌస్‌పై దాడులు నిర్వహించారు. ఓ మహిళ, ఇద్దరు పురషులు, ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వారి గురించి ఆరా తీయగా మహిళ ఓ మహిళా ఎస్సై తల్లని పట్టుబడిన పురుషుల్లో ఒకరు మహిళా ఎస్సై తమ్ముడని తేలింది. ఇంకో వ్యక్తి విటుడని గుర్తించారు. తల్లి, తమ్ముడితోపాటు విటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇద్దరు యువతులను హోమ్‌కు తరలించారు.

ఏడాది క్రితమే మహిళా ఎస్సైకి మ్యారేజ్..
ఆ మహిళా ఎస్సైకి ఏడాది క్రితమే వివాహం అయింది. దీంతో ఆమె భర్తతో కలిసి మరో చోట ఉంటుంది. ఆమె తల్లి, తమ్ముడు ఎంఆర్‌పల్లి సమీపంలోని ధనలక్ష్మినగర్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో కూతురు ఎస్సై కాబట్టి ఎవరికీ అనుమానం రాదని, తమను ఎవరూ ఏమీ అనరని భావించినట్లు ఉన్నారు. ఏకంగా బ్రోతల్ హౌస్ ఓపెన్ చేశారు. పరువు తక్కువ పని చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. కేసును పలు కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.