Viral Video : టికెట్ లేకుండా వందేభారత్ రైలు ఎక్కిన పోలీసు.. చెమటలు పట్టించిన టీసీ.. వైరల్ వీడియో

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కానిస్టేబుల్ గమ్యాన్ని చేరేందుకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. అంతేకాకుండా తన పక్కసీట్లో లగేజ్ పెట్టుకున్నాడు.

Written By: NARESH, Updated On : October 13, 2023 5:43 pm
Follow us on

Viral Video : రైలు పట్టాలపై వేగంగా ప్రయాణించడానికి కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రైలు విషయం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించిన కొత్తలో పశువులను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఓ వ్యక్తి టికెట్ లేకుండా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఫొటో దిగుదామని ఎక్కి డోర్ లాక్ కావడంతో కొంత దూరం ప్రయాణించాల్సి వచ్చింది. తాజాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ నుంచి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే?

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలపై వచ్చినప్పటి నుంచి అందులో ఒక్కాసారైనా ఎక్కాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అయితో ఓ వ్యక్తికి కూడా కోరిక కలిగింది. అతను సాధారణ వ్యక్తి కాదు. ఓపోలీస్ కానిస్టేబుల్. కానీ ఇలా రైలు ఎక్కిన ఆయన ఆ తరువాత కొద్ది సేపటికి టీసీ తన వద్దకు రాగానే షాక్ తిన్నాడు. ఎందుకంటే తన దగ్గర టికెట్ లేదు. టీసీ తన టికెట్ చూపించమనిఅడగగా తన దగ్గ టికెట్ లేదని చెప్పాడు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ కానిస్టేబుల్ గమ్యాన్ని చేరేందుకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. అంతేకాకుండా తన పక్కసీట్లో లగేజ్ పెట్టుకున్నాడు. అయితే టీసీ వచ్చి తనను టికెట్ అడగగా… తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కావడంతో ఇందులో ఎక్కానని చెప్పాడు. అయినా టికెట్ తీసుకోవాలని టీసీ చెప్పాడు. ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి టికెట్ లేకుండా ఎలా ప్రయాణిస్తారని అడిగారు. వీరి మధ్య జరిగిన సంభాషనను అక్కడున్న కొంత మంది వీడియో తీశారు.

ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఓ కానిస్టేబుల్ కు టికెట్ తీసుకోవాలని తెలియదా? అని కొందరు కామెంట్లు పెట్టడం విశేషం. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా వందే భారత్ పై ప్రశంసలు దక్కుతుండా ఇలాంటి కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని నెట్టంట్లో తీవ్ర చర్చ సాగుతోంది. అయితే రైల్వే అధికారులు చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.