https://oktelugu.com/

POCSO Act: కలిసి కాపురం, తర్వాత కేసులా.. పోక్సో దుర్వినియోగంపై పొట్టుపొట్టు కడిగేసిన బాంబే హైకోర్టు..

ప్రస్తుత ఐపీసీ చట్టం ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల 364 రోజుల వయసున్న బాలికతో ఆమె ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే నేరంగా పరిగణించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. దీనివలన చట్టాలను దుర్వినియోగం చేసేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోందని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 16, 2023 / 12:47 PM IST

    POCSO Act

    Follow us on

    POCSO Act: మైనర్లపై లైంగిక దాడిచేసేవారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్రం పోక్సో చట్టం తెచ్చింది. నేరం రుజువైతే ఈ చట్టం కింద నేరస్థులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఈ చట్టం దుర్వినియోగం పెరిగింది. పరస్పర అంగీకారంతో శృగారంలో పాల్గొని తర్వాత మనస్పర్థలు వచ్చి పోక్సో చట్టం కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని బాంబే హైకోర్టు తప్పు పట్టింది. ఇదే క్రమంలో 17 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొన్న కేసులో నుండి యువకుడికి విముక్తి కలిగించింది.

    దుర్వినియోగం పెరుగుతోంది..
    ప్రస్తుత ఐపీసీ చట్టం ప్రకారం 20 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల 364 రోజుల వయసున్న బాలికతో ఆమె ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొంటే నేరంగా పరిగణించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. దీనివలన చట్టాలను దుర్వినియోగం చేసేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోందని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.

    ఇష్టపూర్వకంగా కలిసి.. తర్వాత కేసులు..
    కోర్టు తెలిపిన వివరాల ప్రకారం శృంగార సంబంధాన్ని ఇష్టపూర్వకంగా కొనసాగించిన తర్వాత కేసులు నమోదు చేయడం క్రిమినల్‌ న్యాయ వ్యవస్థకు భారంగా మారిందని కోర్టు అభిప్రాయపడింది. చట్టం, న్యాయవ్యవస్థ ఇటువంటి కేసుల్లో నిందితుడికి మద్దతుగా నిలవలేకపోతున్నాయని తెలిపింది. ఒకవేళ ఆ యువతి సమ్మతంతోనే శృంగారం జరిగితే మాత్రం నిందితుడిని నిర్దోషిగా విడుదల చెయ్యాలని 31 పేజీల తీర్పులో తెలిపింది.
    టీనేజ్‌లో ఉన్నవారిపై ఈ తరహా చట్టాలు అమలు చేయడం ద్వారా వారి లైంగిక స్వేచ్ఛను దెబ్బతీసినట్టవుతుందని పేర్కొంది. అత్యధిక కేసుల్లో బాలికలు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొని తర్వాత ప్లేటు ఫిరాయించడంతో మగవారే ఎక్కువగా శిక్షించబడుతున్నారని చెప్పింది. పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే అది రేప్‌ కింద కూడా పరిగణించకూడదని తెలిపింది. చట్టం దృష్టిలో మైనర్‌ బాలికలు శృంగారానికి అంగీకరించినా అది లెక్కలోకి రాదు. ఆకర్షించబడ్డ యువకులకు మాత్రమే ఇది చిక్కుల్ని కొనితెచ్చి పెడుతుంది.

    నిజంగా నేరం జరిగితే ఈ చట్టంతో న్యాయం..
    మైనర్లను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకే పోక్సో చట్టం రూపొందించబడింది. నిజంగా బాలిక ఇష్టానికి వ్యతిరేకంగా శృంగారానికి పాల్పడితే ఆ వ్యక్తి ని ఈ చట్టం కింద విచారించడం తప్పులేదు. అలాంటివి కాని కేసుల్లో నియంత్రణ అవసరమని తెలిపింది న్యాయస్థానం. ఈ అంశాన్ని పార్లమెంటు కూడా సీరియస్‌గా పరిగణించాలని సూచించింది.