https://oktelugu.com/

Sitara- Allu Arha: ఒక యాడ్ కి కోటి, నిమిషానికి రెండు లక్షలు… సంపాదనలో పోటీపడుతున్న స్టార్ కిడ్స్

సితార ఘట్టమనేని, అల్లు అర్హ అరుదైన రికార్డ్స్ నెలకొల్పుతున్నారు. పసిప్రాయంలోనే లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. స్టార్డం, ఫేమ్ లో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. సితార చాలా కాలంగా సోషల్ మీడియా వాడుతుంది. తరచుగా డాన్స్, సింగింగ్ వీడియోలు షేర్ చేస్తుంది. అలాగే తన టూర్ డైరీస్ ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. సితార డాన్స్ నేర్చుకుంటుంది. 11ఏళ్ల సితారకు చాలా విషయాల మీద అవగాహన ఉంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 16, 2023 / 12:52 PM IST

    Sitara- Allu Arha

    Follow us on

    Sitara- Allu Arha: ఒకప్పుడు స్టార్ హీరోల ఫ్యామిలీ డీటెయిల్స్ అంతగా తెలిసేవి కావు. కాలం మారింది. సోషల్ మీడియా పుణ్యమా అని సదరు హీరోల భార్యలు, పిల్లలు సోషల్ మీడియా సెలబ్స్ గా అవతరిస్తున్నారు. అది వారి కెరీర్ కి దోహదం చేస్తుంది. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు దోహదం చేస్తుంది. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల భార్యలకు సమాజంలో భారీ క్రేజ్ ఉంది.ఇక మహేష్, అల్లు అర్జున్ కుమార్తెలు సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు

    సితార ఘట్టమనేని, అల్లు అర్హ అరుదైన రికార్డ్స్ నెలకొల్పుతున్నారు. పసిప్రాయంలోనే లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. స్టార్డం, ఫేమ్ లో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. సితార చాలా కాలంగా సోషల్ మీడియా వాడుతుంది. తరచుగా డాన్స్, సింగింగ్ వీడియోలు షేర్ చేస్తుంది. అలాగే తన టూర్ డైరీస్ ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. సితార డాన్స్ నేర్చుకుంటుంది. 11ఏళ్ల సితారకు చాలా విషయాల మీద అవగాహన ఉంది.

    సితారను ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఈ స్టార్ కిడ్ కి ఉన్న ఇమేజ్ రీత్యా అంతర్జాతీయ జ్యూవెలరీ సంస్థ పిఎంజే బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. పిఎంజే యాడ్ షూట్ లో పాల్గొన్న సితార కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఒక సామాన్యుడి లైఫ్ టైం ఎర్నింగ్ అది. కోటి రూపాయలు జస్ట్ ఒక యాడ్ లో నటించినందుకు సితార చిన్న వయసులో సంపాదించింది.

    ఈ మొత్తాన్ని సితార ఛారిటీ కోసం డొనేట్ చేశారట. అల్లు అర్హ కూడా తక్కువేం కాదు. సితార కంటే చిన్నదైన అర్హ ఆమెకు పోటీ ఇస్తుంది. ఇటీవల అర్హ శాకుంతలం మూవీలో నటించింది. బాల భరతుడు పాత్రలో మెరిసింది. నెక్స్ట్ అర్హ దేవర మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేస్తుందట. కేవలం పది నిమిషాల నిడివి కలిగిన పాత్రకు అర్హ రూ. 20 లక్షల పారితోషికం తీసుకుందట. అంటే నిమిషానికి రెండు లక్షలు. ఐదారేళ్ళ ప్రాయంలో అంత పెద్ద మొత్తం అర్హ సంపాదించింది. దీంతో సితార, అర్హ సంపాదనలో ఒకరికొకరు పోటీపడుతున్నారని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.