గత కొన్ని సంవత్సరాలుగా నాసా ఎన్నో ఫోటోలను బయటపెడుతోంది. అయితే ఆ ఫోటోలకు సంబంధించి సరైన వివరణ ఇవ్వడంలో మాత్రం నాసా పూర్తిగా విఫలమవుతోంది. విగ్రహాలు, బీర్ బాటిల్స్, సైనికుడు లాంటి ఎన్నో ఫోటోలను నాసా గతంలో బయటపెట్టింది. 2017లో నాసా మార్స్ పై సైనికుడిలా కనిపిస్తున్న ఒక వ్యక్తికి సంబంధించిన ఫోటోను విడుదల చేసింది. ఒక వ్యక్తి స్పేస్ సూట్ ధరించి ఆయుధాన్ని మోస్తున్నట్టుగా ఆ ఫోటోలో ఉంది.

కొన్ని రికార్డుల ప్రకారం గ్రీకు ఫిలాసఫర్ సోక్రటీస్ అంతరిక్ష యానం చేసినట్లు తెలుస్తోంది. 15 సంవత్సరాల క్రితం మాస్క్ ముఖం ఆకృతితో ఉన్న ఫోటోను స్కాట్ సీ వారింగ్ అనే వ్యక్తి విడుదల చేశాడు. దీంతో ఆయన మార్స్ నుంచి భూమిపైకి వచ్చాడా…? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. స్కాట్ సీ వారింగ్ పరిశోధనల్లో ఈజిఫ్ట్ పూర్వీకులను పోలి ఉండే విధంగా ఉన్న శిల కనిపించింది. దీంతో ఈజిఫ్టియన్లు మార్స్ నుంచే వచ్చారా….? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

2017లో పరిశోధనలు చేసే ఒక వ్యక్తి మార్స్ లో ఉండే గ్రహాంతరవాసులు బీర్ తాగుతున్నారని… మార్స్ గ్రహంపై బీర్ బాటిళ్లకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నాడు. ఈ ఫోటోను మార్స్ లో ఉండే రోవర్ తీసిందని సమాచారం. 2018 నవంబర్ నెలలో మార్స్ లాండర్ మార్స్ గ్రహంపై ఉన్న విగ్రహాలకు సంబంధించిన ఫోటోలను తీసింది. అక్కడి తలాలపై మనుషుల రూపాన్ని పోలి ఉండే విగ్రహాలు ఉండటం గమనార్హం. భవిష్యత్తులో నాసా విడుదల చేసే ఫోటోలలో మనం ఇంకెన్ని అద్భుతాలను చూడాల్సి వస్తుందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.