75 కోట్ల దోమ‌ల‌తో యూఎస్ ప్రయోగం.. ఫలితం ఏంటంటే?

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల విజృంభణ అంతకంతకూ పెరుగుతుంది. దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధుల వల్ల మనం పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే దోమలను అదుపు చేయడానికి పలు దేశాలు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి. అగ్ర‌రాజ్యం అమెరికా జన్యుపరంగా అభివృద్ధి చేసిన దోమలతో సరికొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమైంది. మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలతో పాటు ఎల్లో ఫీవర్, చికున్ గున్యా, జికా లాంటి వ్యాధుల బారిన […]

Written By: Navya, Updated On : August 23, 2020 11:57 am
Follow us on

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల విజృంభణ అంతకంతకూ పెరుగుతుంది. దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధుల వల్ల మనం పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే దోమలను అదుపు చేయడానికి పలు దేశాలు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి. అగ్ర‌రాజ్యం అమెరికా జన్యుపరంగా అభివృద్ధి చేసిన దోమలతో సరికొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమైంది.

మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలతో పాటు ఎల్లో ఫీవర్, చికున్ గున్యా, జికా లాంటి వ్యాధుల బారిన పడటానికి దోమలు కారణమవుతున్నాయి. ఏడిస్ ఏజిప్టి అనే ఆడ దోమ‌లు కుట్టడం వల్ల మనుషులు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ దోమలను నివారించాలనే ఉద్దేశంతో అమెరికా సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. జన్యుపరంగా వృద్ధి చేసిన 75 కోట్ల దోమలను ఫ్లోరిడాలో వదలనుంది.

అమెరికా ఆక్సిటెక్ కంపెనీ ల్యాబ్‌ల‌లో భారీ సంఖ్యలో ఈ దోమలను పెంచింది. ఈ దోమలు ox5034 పేరుతో పిలవబడే జన్యుపరమైన మార్పులు చేయబడిన దోమలు ఆడ ఏడిస్ దోమ‌ల‌తో సంయోగం జరిపితే ఆ దోమలు కొన్ని రోజుల తర్వాత మరణిస్తాయి. తాజాగా దోమల వృద్ధిని అరికట్టే ఈ పైలట్ ప్రాజెక్ట్ కు అమెరికా నుంచి ఆమోదం లభించింది. గతంలో బ్రెజిల్ సైతం ఇదే తరహా ప్రయోగాలు చేసింది. ఈ ప్రయోగాల ద్వారా దోమల సంఖ్య భారీగా తగ్గడంతో పాటు అంటువ్యాధుల బారిన పడే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతుండటం గమనార్హం.