https://oktelugu.com/

Producer VA Durai : దయనీయం… ఒకప్పుడు రజినీకాంత్ తో సినిమా చేశాడు, ఇప్పుడు వైద్యానికి కూడా డబ్బుల్లేవ్!

Producer VA Durai : ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో ఒకప్పుడు టాప్ స్టార్స్ తో సినిమాలు నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ విఏ దురై పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. కనీసం వైద్యానికి డబ్బుల్లేక సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత వీఏ దురై ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు కూడా డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలిసిన ప్రముఖ నటుడు సూర్య రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 7, 2023 / 12:11 PM IST
    Follow us on

    Producer VA Durai : ఓడలు బండ్లు బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో ఒకప్పుడు టాప్ స్టార్స్ తో సినిమాలు నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ విఏ దురై పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. కనీసం వైద్యానికి డబ్బుల్లేక సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత వీఏ దురై ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు కూడా డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలిసిన ప్రముఖ నటుడు సూర్య రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. చిత్ర పరిశ్రమకు చెందిన మరికొందరు కూడా ఆయనకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు.

    నిర్మాత ఏఎం రత్ననాథ్‌తో కలిసి ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో దురై కలిసి పనిచేశారు. ఆ తర్వాత సొంత నిర్మాణ సంస్థ ఎవర్‌గ్రీన్ ఇంటర్నేషనల్ ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించారు. అయితే, ఆ తర్వాత నష్టపోయి కుదేలయ్యారు. ప్రస్తుతం ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇప్పుడు వైద్య సహాయం అవసరమని, శస్త్ర చికిత్సకు అవసరమైన డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయన స్నేహితుడు ఒకరు ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

    దురై నిర్మించిన చివరి సినిమా గజేంద్ర. అంతకుముందు పితామగన్, లవ్‌లీ, లూటీ వంటి చిత్రాలను నిర్మించారు. బాల దర్శకత్వంలో తెరకెక్కిన పితామగన్ సినిమాలో సూర్య, విక్రమ్ కలిసి నటించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు దక్కింది.రజనీకాంత్, విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ లతో ఆయన సక్సెస్ ఫుల్ చిత్రాలు తీశారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన బాబా నిరాశపరిచింది. బాబా ఆయనకు పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చినట్లు సమాచారం. దురైకి సొంత ఇల్లు కూడా లేదని, చేతిలో చిల్లిగవ్వ లేదని ఆయన స్నేహితుడు కుమార్ తెలిపారు.

    కాగా తనతో శివపుత్రుడు చిత్రం చేసిన డైరెక్టర్ బాలకు 2003లో దురై రూ. 25 లక్షల అడ్వాన్స్ ఇచ్చారట. అనుకోని కారణాలతో ఆ సినిమా పట్టాలకెక్కపోవడంతో ఇచ్చిన డబ్బులు బాల తిరిగి ఇవ్వలేదట. ఇది జరిగిన 19 సంవత్సరాల తర్వాత దురై పరిస్థితి తారుమారైంది. దాంతో ఆ డబ్బులు ఇవ్వాలంటూ గత ఏడాది బాలను కోరారని సమాచారం. బాల డబ్బులు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో బాల కార్యాలయం వద్ద దురై నిరసన కూడా తెలిపారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దురై అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన సూర్య, వెట్రిమారన్‌లు కొంత సాయం చేశారు. మరింత సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.