Homeజాతీయ వార్తలుMLC Kavitha: కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత.. తెరవెనుక సంగతులివీ

MLC Kavitha: కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత.. తెరవెనుక సంగతులివీ

MLC Kavitha
MLC Kavitha
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ వేగంగా అడుగులు వేస్తోంది. ఎంతటి వారినైనా ఉపేక్షించడం లేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విషయంలో అయితే ఎంత దూకుడుగా వ్యవహరించిందో చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం చార్జ్ షీట్ లో పేరు ప్రస్తావించకుండా ఆయనను అరెస్టు చేసింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నప్పటికీ దర్యాప్తు సంస్థల అధికారులు ముందుకే వెళ్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎంత మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయి? ఈ వ్యవహారాలపై కూపీలాగే ప్రయత్నం సిబిఐ చేస్తోంది. మరోవైపు ఐటీ శాఖ కూడా అన్ని తీగలూ లాగుతున్నది.
స్వరం పెంచిన కవిత
ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇటీవల స్వరం పెంచారు. గతంలో ఎన్నడు లేని విధంగా మోడీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఏకంగా ఢిల్లీలో దీక్ష చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో భారీ ఎత్తున మీటింగ్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు గతంలో నిస్తేజంగా ఉన్న తెలంగాణ జాగృతికి మళ్లీ ఇప్పుడు కొత్తగా అధ్యక్షులను నియమించారు. పాత కమిటీలను పూర్తిగా రద్దు చేశారు. పైగా వివిధ న్యూస్ చానల్స్ కు ఇంటర్వ్యూ లు కూడా ఇస్తున్నారు.

Also Read: AP Global Summit : ముకేష్ అంబానీ పెట్టుబడులతో ఏపీకి భరోసా.. చంద్రబాబు కంటే జగన్ బెటరా?

సౌత్ గ్రూపులోకి ప్రవేశించడమే తల నొప్పి అయిపోయింది
వాస్తవానికి ఎంపీగా ఓడిపోయిన తర్వాత కవిత పెద్దగా జన బహుల్యం లోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇదే సమయంలో కెసిఆర్ ఆమెను ఎమ్మెల్సీగా ప్రమోట్ చేశారు.. తర్వాత ఆమె సౌత్ గ్రూప్ ద్వారా మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. కాకపోతే ఇందులో అనేక అక్రమాలకు పాల్పడడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఆమె పాత్ర కూడా తెర పైకి వచ్చింది.. దీంతో అప్పటినుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు కవితను ఓ కంట కనిపెడుతున్నాయి. పైగా ఆ మధ్య విచారించాలి అని అడిగితే కవిత నో చెప్పింది. తర్వాత రమ్మని కబురు పంపింది. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఈ కేసు కు సంబంధించి నివేదికను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలోనే కవిత పేరు చార్జిషీట్లో నమోదు చేసింది. ఈ పరిణామం తర్వాత ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసిన నేపథ్యంలో కవిత అప్రమత్తమైంది. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఆమె వరుస పర్యటనలు చేస్తూనే ఉంది.
MLC Kavitha
MLC Kavitha
కేంద్రం పై విమర్శలు
ఆ మధ్య ఢిల్లీలో బి బి సి కి సంబంధించిన అవార్డుల ప్రధానం జరిగింది. ఈ కార్యక్రమానికి కవిత హాజరైంది. అవార్డుల కార్యక్రమాన్ని పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది. అయితే ఇలాంటి సమయంలో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా నుంచి కవితకు పూర్తి సహకారం ఉండాల్సి ఉండేది. కానీ యాదృచ్ఛికంగా అవేమీ ఆమెకు లభించడం లేదు. పైగా ఒంటరి పోరాటం చేస్తోంది. మరోవైపు అధికార పత్రికలో అంతంతమాత్రంగానే స్పేస్ లభిస్తోంది. తన సోదరుడు కేటీఆర్ కూడా కవితకు సపోర్టుగా నిలబడటం లేదు. అప్పుడప్పుడు కేంద్రంపై విమర్శలు చేస్తున్నాడు గానీ.. కవిత పై వస్తున్న ఆరోపణలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఖండించడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లిక్కర్ స్కాం తర్వాత కవితకు, కేటీఆర్ కు గ్యాప్ పెరిగిందని సమాచారం. అందువల్లే ఆమెకు బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి మద్దతు దక్కడం లేదని తెలుస్తోంది. ఇక ఇలాగైతే పని లేదనుకొని కవితే నేరుగా రంగంలోకి దిగి, టీవీ9, ఎన్ టీవీ కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే ఇవి ఆమెకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేకూర్చుతున్నాయి.. ఆమె సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నది. అయితే రేపు మా పో అరెస్ట్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సి ఉంది..అన్నట్టు కవితకు మాత్రం తన తండ్రికి కేసీఆర్ నుంచి ఫుల్ సపోర్టు లభిస్తున్నట్టు సమాచారం..కానీ ఇంత జరుగుతున్నప్పటికీ భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా కవితను ఎందుకు పట్టించుకోవడం లేదని అనుమానం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. అట ఈ పరిణామం పార్టీపై కేటీఆర్ కు పెరిగిన పట్టును సూచిస్తోందని, కేసీఆర్ తన పట్టును కోల్పోతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి..

Also Read: Producer VA Durai : దయనీయం… ఒకప్పుడు రజినీకాంత్ తో సినిమా చేశాడు, ఇప్పుడు వైద్యానికి కూడా డబ్బుల్లేవ్!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version