
Allu Arjun – Sukumar : అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 టీజర్ విడుదల చేశారు. మూడు నిమిషాలకు పైగా నిడివి కలిగిన టీజర్ ఎక్కడా తగ్గలేదు. ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని అదిరిపోయేలా టీజర్ కట్ చేశారు. తెలుగుకు మించి హిందీలో పుష్ప 2 టీజర్ కి రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో హిందీ వర్షన్ అత్యధిక వ్యూస్ రాబట్టింది. టీజర్ తో పాటు యూనిట్ అధికారికంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ భిన్న వాదనలకు దారి తీశాయి. ఓ షాట్ లో అల్లు అర్జున్ నైల్ పాలిష్ వేసుకుని కనిపించారు. ఆ లుక్ చూసిన పలువురు బన్నీ పుష్ప 2లో హిజ్రా రోల్ చేశారంటూ అంచనా వేస్తున్నారు.
అలాగే భయంకరమైన అమ్మోరు గెటప్ చూసి జడుసుకునే పరిస్థితి. ఈ లుక్ కి అప్లాజ్ తో పాటు విమర్శలు కూడా ఎదురయ్యాయి. గత చిత్రాల్లోని కొన్ని పాత్రలతో పోల్చుతూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఈ గెటప్ వెనుక చాలా పెద్ద కథే ఉందట. గతంలో తిరుపతి ప్రాంతంలో పాలెగాళ్లు అరాచకాలకు పాల్పడుతూ ఉండేవారట. యువతులు, మహిళలపై అఘాయిత్యాలు చేశేవారట. వారిని అంతమొందించేందుకు దేవత గంగమ్మగా అవతరించిందట. ఆ దేవత జాతర ప్రతి ఏటా నిర్వహిస్తారట. గంగమ్మ జాతరలో అమ్మోరు గెటప్ లో బన్నీకి భారీ ఫైట్ ఉందట.
ఆ ఫైట్ కి సంబంధించిన గెటప్ విడుదల చేశారంటున్నారు. అలాగే రెడ్ శాండిల్ స్మగ్లర్ గా ఎదిగిన పుష్ప గెటప్ సెటప్ పార్ట్ 2 లో మారిపోయింది. పార్ట్ 1 లో ఎర్ర చందనం కూలీగా మురికి బట్టలతో కనిపించాడు. సెకండ్ పార్ట్ లో పుష్ప సిండికేట్ కింగ్. కోట్లు సంపాదించే మాఫియా డాన్. దీంతో అల్లు అర్జున్ లుక్ భిన్నంగా డిజైన్ చేశారు. పీరియాడిక్ లుక్ కావడంతో అప్పటి డాన్స్ ఎలాంటి బట్టలు ధరించేవారు అనేది పరిగణలోకి తీసుకున్నారు.
రంగు రంగుల డిజైన్ కలిగిన ఛిఫాన్ షర్ట్స్, ఒంటి నిండా జ్యువెలరీతో చూపించాడు. పుష్ప డ్రెస్సింగ్ చూస్తే… కెజిఎఫ్ మూవీలో ఆండ్రూస్ గెటప్ గుర్తుకు వస్తుంది. కెజిఎఫ్ సైతం పీరియాడిక్ మూవీ కాగా గోల్డ్ మాఫియా డాన్స్ లో ఒకరైన ఆండ్రూస్ గెటప్ ప్రశాంత్ నీల్ అలా డిజైన్ చేశాడు. చెప్పాలంటే గతంలో ఏ దర్శకుడు అల్లు అర్జున్ ని చూపించనంత భిన్నంగా, ఘోరంగా సుకుమార్ అల్లు అర్జున్ ని ప్రజెంట్ చేశాడు.