
Allu Arjun’s assets : అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరు. పుష్ప 2 చిత్రానికి ఆయన రూ. 80-100 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. తాతయ్య అల్లు రామలింగయ్య, నాన్న అల్లు అరవింద్ ద్వారా ఆయనకు కొన్ని ఆస్తులు సంక్రమించాయి. టాలీవుడ్ లో అత్యంత సంపద కలిగిన హీరోల్లో ఒకరిగా ఆయన ఉన్నారు. అల్లు అర్జున్ వద్ద ఉన్న విలువైన కార్లు, బంగ్లాను, ఆస్తుల విలువ తెలిస్తే మతిపోతుంది.
అల్లు అర్జున్ కి కార్ కలెక్షన్ అంటే ప్రీతి. ఆయన వద్ద అనేక లగ్జరీ సెగ్మెంట్ కార్లు ఉన్నాయి. అల్లు అర్జున్ ఖరీదైన కారవాన్ కలిగి ఉన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన కారవాన్ ధర రూ. 7 కోట్లు అని సమాచారం. దీని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళడానికి ఇష్టపడే బన్నీ వద్ద హమ్మర్ H2 ఉంది. దీని విలువ రూ. 75 లక్షలని సమాచారం. 2019లో రేంజ్ రోవర్ వోగ్ కారును కొన్నారు. దీనికి బీస్ట్ అని పేరు పెట్టారు. ఈ రేంజ్ రోవర్ ధర రూ. రూ. 4 కోట్ల వరకు ఉండొచ్చని వినికిడి.
ఇంకా ఆయన వద్ద జాగ్వార్ X JL, వోల్వో XC90 T8, BMW X6 M వంటి ఖరీదైన స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి. అలాగే ఆయన వద్ద ఓ ప్రైవేట్ జెట్ ఉంది. పరిశ్రమలో అతి కొద్ది మంది హీరోలు మాత్రమే ప్రైవేట్ జెట్స్ కలిగి ఉన్నారు. గత ఏడాది కోట్లు వెచ్చించి అల్లు స్టూడియో ఏర్పాటు చేశారు. అలాగే అల్లు అర్జున్ కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన ఆహా ఓటీటీ యాప్ లో పెట్టుబడి అల్లు అర్జున్ దేనట. మొత్తంగా అల్లు అర్జున్ ఆస్తుల విలువ రూ. 350 కోట్ల వరకు ఉంటాయట.
రానున్న కాలంలో ఆయన ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం కలదు. వంద కోట్లకు పైగా తీసుకుంటున్న అల్లు అర్జున్ పెద్ద మొత్తంలో ఆర్జించనున్నారు. ఆయన సైన్ చేస్తే కోట్లు కుమ్మరించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అలాగే పలు సంస్థల ఉత్పత్తులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. అరడజనుకు పైగా బ్రాండ్స్ కి అల్లు అర్జున్ ప్రచారకర్తగా ఉన్నారు.