https://oktelugu.com/

Ravanasura Collections : ‘రావణాసుర’ 2 రోజుల వసూళ్లు.. రవితేజ మాస్.. బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత రావాలంటే!

Ravanasura Collections : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ ఊపులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.’ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ సినిమాల తర్వాత రవితేజ కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తూ తీసిన ‘రావణాసుర’ చిత్రం నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చింది కానీ, సాయంత్రానికి టాక్ స్థిరపడింది. ఈ చిత్రానికి కావాల్సిన హైప్ మొదటి నుండి ఎందుకో రాలేదు, ఓపెనింగ్స్ అసలు ఉండవేమో అని అనుకున్నారు.కానీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 8, 2023 / 09:16 PM IST
    Follow us on

    Ravanasura Collections : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్ ఊపులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.’ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ సినిమాల తర్వాత రవితేజ కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తూ తీసిన ‘రావణాసుర’ చిత్రం నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.మొదట్లో కాస్త డివైడ్ టాక్ వచ్చింది కానీ, సాయంత్రానికి టాక్ స్థిరపడింది.

    ఈ చిత్రానికి కావాల్సిన హైప్ మొదటి నుండి ఎందుకో రాలేదు, ఓపెనింగ్స్ అసలు ఉండవేమో అని అనుకున్నారు.కానీ రవితేజ క్రేజ్ వల్ల, మాస్ లో ఆయనకీ ఉన్న అద్భుతమైన ఫాలోయింగ్ వల్ల ఈ సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి.ఆయన గత చిత్రం ధమాకా మొదటి రోజు నాలుగు కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.’రావణాసుర’ చిత్రానికి మొదటి రోజు నాలుగు కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఈ వసూళ్లను చూసి ట్రేడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది.ఎందుకంటే కనీసం రెండు కోట్ల రూపాయిల షేర్ ని అయినా వసూలు చేస్తుందో లేదో అనుకున్నారు, సరైన పాటలు లేకుండా కేవలం రవితేజ ఇమేజి తో ఇంత ఓపెనింగ్ వచ్చింది అంటే సాధారణమైన విషయం కాదు.రెండవ రోజు కూడా ఈ సినిమాకి డీసెంట్ హోల్డ్ ఉంది, ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే రెండవ రోజు ఈ చిత్రానికి దాదాపుగా మూడు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది తెలుస్తుంది.

    అలా రెండు రోజులకు సుమారుగా 8 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది అన్నమాట.ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరిగింది,బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 14 కోట్లు వసూలు చెయ్యాలి, రేపు ఆదివారం కాబట్టి మంచి వసూళ్లే వస్తాయి, సోమవారం నుండి కలెక్షన్స్ నిలబెడుతాయా లేదా అనేది చూడాలి.