Aishwarya Rai’s Daughter : తన గౌరవానికి భంగం కలుగుతుందంటూ ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెలబ్రిటీల మీద దుష్ప్రచారం చేయడం యూట్యూబ్ ఛానల్స్ కి పరిపాటిగా మారిపోయింది. పలువురు ప్రముఖులు నిరాధార వీడియోల కారణంగా మానసిక వేదనకు గురవుతున్నారు. విడాకులు ప్రకటన అనంతరం సమంత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో ఛానల్స్ మీద కోర్టు చర్యలు తీసుకుంది. ఇదే తరహా సమస్యను ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఎదుర్కొంటున్నారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం, ట్రోలింగ్ ఆపేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఆరాధ్య తరపున ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్ కోర్టును ఆశ్రయించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆరాధ్య ఆరోగ్యం, వ్యక్తిగత విషయాల మీద తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారట. సదరు ఛానల్స్ వీడియోలు ఆధారంగా చూపుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆరాధ్య ఫిర్యాదుపై కోర్టు సీరియస్ అయ్యింది. ఆరాధ్య గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేసిన తొమ్మిది యూట్యూబ్ ఛానల్స్ ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెలబ్రిటీ చైల్డ్ అయినా, సాధారణ చైల్డ్ అయినా బాల్యంలో ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పెరిగే హక్కు కలిగి ఉన్నారు. నిరాధార కథనాలతో వాళ్ళను మానసికంగా వేధించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
ఆరాధ్యపై రూపొందించిన వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు వెలువరించి ఈ తీర్పు సంచలనంగా మారింది. 2007లో ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ ల వివాహం జరిగింది. పెళ్ళైన నాలుగేళ్లకు 2011లో ఆరాధ్య జన్మించింది. అప్పట్లో ఇదో సంచలన వార్త. ప్రపంచ సుందరిగా పేరుగాంచిన ఐశ్వర్య రాయ్ కి పుట్టిన అమ్మాయి ఎలా ఉందో తెలుసుకోవాలని మీడియా, జనాలు తెగ ఆరాటపడ్డారు.
ఐశ్వర్య రాయ్ కొన్నేళ్ల పాటు కూతురిని మీడియా కంట పడనీయలేదు. ఆరాధ్య లుక్ మీద అంతటి హైప్ నడిచింది. మరోవైపు ఐశ్వర్య రాయ్-అభిషేక్ విడాకులు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య ఐశ్వర్య ఒంటరిగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పుకారు ఊపందుకుంది. నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్ కి ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్యతో పాటు ఒంటరిగా వచ్చారు. ఈ క్రమంలో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి.