Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రం #OG..ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఆస్కార్ అవార్డు ని గెలుచుకున్న #RRR మూవీ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం అయ్యింది.మొదట పవన్ కళ్యాణ్ లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

మొన్నటి నుండి పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు.ఈ సందర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రానికి సంబంధించి నాన్ స్టాప్ గా అప్డేట్స్ ఇవ్వడం ప్రారంభించింది.సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన #OG గురించే చర్చ, పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫొటోలే తిరుగుతున్నాయి.ఇప్పుడే ఇంత హైప్ ఉంటే, ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ సమయం లో ఏ రేంజ్ హైప్ ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి ప్రారంభం రోజు మూవీ టీం ఒక స్పెషల్ మేకింగ్ వీడియో ని విడుదల చేసింది.దీనికి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది,#OG స్క్రిప్ట్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న గ్లిమ్స్ ని ఇచ్చాడు డైరెక్టర్ ఈ వీడియో ద్వారా.ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ చాలా ఫ్రెష్ గా, ఇది వరకు ఎవ్వరూ చూడని విధంగా ఉంటుందట.

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘కొండవీటి దొంగ’ సినిమా మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.ఆ సినిమాలో చిరంజీవి నల్లని బట్టలు ధరించి ఉంటాడు.#OG లో కూడా పవన్ కళ్యాణ్ లుక్ అదే విధంగా ఉంటుందట,కానీ స్టైలిష్ గా ఉంటుందట.సమురాయ్ గెటప్ లో ఆయన కత్తి పట్టుకొని తిప్పుతుంటే ఫ్యాన్స్ మెంటలెక్కిపోవడం ఖాయం.ఈ చిత్రానికి సంబంధించి మరి కొన్ని అప్డేట్స్ త్వరలోనే తెలియనున్నాయి.