Road Accidents: వేగం కన్నా ప్రాణం మిన్న అని నినాదం చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కన్న వారికి కడుపుకోత మిగులుస్తున్నారు. కట్టుకున్న వారికి శోకమే కలుగుతోంది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం తాగుడే. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కంట్రోల్ పవర్ తక్కువగా ఉండి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో తమ నూరేళ్ల జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. చేయని తప్పుకు పశ్చాత్తాపం అనుభవిస్తున్నారు. కాలో చేయో విరిగితే ఇక జీవితం నరకమే. అయినా వారిలో కనువిప్పు కలగడం లేదు.

రోడ్డు ప్రమాదాల్లో 18-45 ఏళ్ల వయసు మధ్య వారే ఎక్కువగా ఉంటున్నారు. కుటుంబ బాధ్యతలు వీరి మీదే ఎక్కువగా ఉన్నా వారు మాత్రం తాగుడుకు బానిసలై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నిత్యం తాగుతూ వాహనాలు నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఎన్ హెచ్ఏఐ ఇటీవల విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ల వయసు వరకు ఉన్న వారే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈ వయసులోనే కుటుంబ బాధ్యతలు మన మీద ఉండటం గమనార్హం. దీంతో వీరే ప్రాణాలు కోల్పోతే ఇక కుటుంబానికి దిక్కెవరు? కుటుంబాన్ని పోషించేదెవరు? కుటుంబ యజమాని చనిపోతే ఇక కుటుంబంలో భార్యనో లేక కుమారుడో ఎవరో ఒకరు కుబుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోంది. అందుకే మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు ఎంత చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ శాశ్వత అంగవైకల్యం జరిగితే కూడా జీవితాంతం కుటుంబం అతడిని పోషించేందుకు నానా కష్టాలు పడాల్సిందే.
రోడ్డు ప్రమాద బాధితుల్లో డెబ్బయ్ శాతం మంది ఈ వయసు వారే నని చెబుతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. డ్రంకెన్ డ్రైవ్ చేపడుతున్నా మందుబాబులు ఆగడం లేదు. సాయంత్రం అయిందంటే చాలు మద్యం సేవిస్తూ నానా హంగామా చేస్తున్నారు. 18-60 వయసు మధ్య వారు తక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1,55,625 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాలు ఎంతగా పెరిగిపోతున్నాయో దీన్ని బట్టి తెలుస్తోంది.