Pawan Kalyan : ఇప్పుడంటే బీరు,బిర్యానీ ఇస్తున్నారు కాబట్టి రాజకీయ పార్టీలు నిర్వహించే భారీ బహిరంగ సభలకు జనం హాజరవుతున్నారు. కానీ ఇవేవీ లేని రోజుల్లో పలు సభలకు జనాలు తండోప తండాలుగా తరలి వెళ్లారు.. ఏకంగా ట్రెండ్ సెట్టింగ్ చేశారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాంటి సభలో ఏవో ఒక్కసారి తెలుసుకుందామా? ఏ మాటకు ఆ మాట ఇలాంటి సభల్లో రికార్డులు క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్. తాజాగా శ్రీకాకుళం రణస్థలం సభకు లక్షల్లో పోటెత్తారు. పవన్ ప్రతీసభకు వెల్లువలా జనం వస్తున్నారు.

20 లక్షల మంది వచ్చారు
అది 1988 సంవత్సరం.. జూలై 10.. విజయవాడ.. ఆ ఎమ్మెల్యే పేరు వంగవీటి మోహన రంగా… కాపునాడు అనే పేరుతో సభ నిర్వహిస్తే జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఏకంగా 20 లక్షల మంది హాజరయ్యారు.. ఆ రోజుల్లో విజయవాడ నగరం ప్రజలతో కిటకిటలాడింది.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.. బందోబస్తుకు వచ్చిన పోలీసులు చేతులు ఎత్తేయడంతో ఆ సభకు వచ్చిన ప్రజలే ఆ పని పూర్తి చేశారు. ఈ సభ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోయయి. వంగవీటి మోహనరంగా కాపు సామాజిక వర్గంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించారు.
ప్రజారాజ్యం ఆవిర్భావ సభకు..
2008 ఆగస్టు 26న తిరుపతి కేంద్రంగా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సభకు 15 లక్షల మంది హాజరయ్యారు. స్వచ్ఛందంగా జనాలు రావడంతో తిరుపతి కిక్కిరిసిపోయింది. రైళ్ళన్నీ కిటకిటలాడాయి. ఈ సభ ద్వారానే ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది.

జనసేన కవాతు
ఆరోజు రాజమండ్రి జనసంద్రమై ఉప్పొంగింది.. జనసేనాని పిలుపుమేరకు ఒక్కో కార్యకర్త ఒక్కోసేనానిలాగా రాజమండ్రి తరలివచ్చారు. కవాతు అని దానికి పేరు పెడితే అచ్చం అలానే కావాతు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా కవాతు చేశారు.. పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు వచ్చిన జనసేన కార్యకర్తలు తమ సత్తాను చాటారు.. ఈ కవాతు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమూలంగా మారాయి అనడంలో అతిశయోక్తి లేదు.
అమెరికాలో 30 లక్షల మంది వచ్చారు
ఇప్పుడంటే కే ఏ పాల్ కామెడీ పీస్ అయ్యాడు గానీ ఒకప్పుడు అతడు సభలు నిర్వహిస్తే జనం వేలాదిగా వచ్చేవారు. అతడిని కలిసేందుకు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వేచి ఉండేవారు. అలాంటి కేఏ పాల్ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అమెరికాలో పీస్ ర్యాలీ నిర్వహిస్తే 30 లక్షల మంది దాకా వచ్చారు. 2001 నవంబర్ 3న ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత పాల్ ఎక్కడికో వెళ్లిపోయాడు.. తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి తన అల్లుడి కోసం పాల్ ను తొక్కేయడం మొదలుపెట్టాడు. ఫలితంగా పాల్ కామెడీ పీస్ అయ్యాడు.
చరిత్రలో నిలిచిపోయిన ఈ నాలుగు సభలకు 77 లక్షల మంది దాకా ప్రజలు వచ్చారు. ఇప్పట్లో ఈ సభలను బ్రేక్ చేయడం ఎవరి వల్లా కాదు అంటే అతిశయోక్తి కాక మానదు