
Pawan-Sai Dharam Movie Title Leak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ టైటిల్ లీక్ అయ్యింది. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా… ఆడియన్స్ ఊహించని విధంగా ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఒక వార్త టాలీవుడ్ ని ఊపేస్తోంది. రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వినోదయ సితం రీమేక్ పట్టాలెక్కించారు. అధికారికంగా సినిమాను ప్రకటించడంతో పాటు షూట్ మొదలు పెడుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. మరో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. మామా-అల్లుళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇద్దరు మెగా హీరోలు స్టైలిష్ లుక్ లో అదరగొట్టారు.
ఇక వినోదయ సితం నుండి క్రేజీ అప్డేట్ ఉంటుందని కూడా నిర్మాతలు చెప్పారు. అది ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ కావచ్చని సమాచారం. ఈ క్రమంలో వినోదయ సితం రీమేక్ టైటిల్ ఇదే అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. అనూహ్యంగా ‘దేవుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. మొదట్లో ఈ చిత్రానికి ‘దేవర’ టైటిల్ పెట్టబోతున్నట్లు ప్రచారం జరిగింది. దేవర కంటే దేవుడు బాగుంటుందని మేకర్స్ ఆలోచనట. ఈ క్రమంలో దేవుడు టైటిల్ లాక్ చేశారట. పవన్-సాయి ధరమ్ ల మల్టీస్టారర్ టైటిల్ ఇదే అంటున్నారు.
అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా ఈ వార్త టాలీవుడ్ ని ఊపేస్తోంది. అప్పుడే పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. పవన్ని ఆయన ఫ్యాన్స్ దేవుడిలా ఆరాధిస్తారు. మేము ఆయన భక్తులమంటారు. ఈ క్రమంలో దేవుడు టైటిల్ పవన్ కి చక్కగా సెట్ అవుతుందంటున్నారు. కాగా ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేశారు. స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. పవన్ ఇమేజ్ కి తగ్గట్లు సమూల మార్పులు చేసినట్లు సమాచారం.

ఇక ఈ చిత్రంలో పవన్ పాత్ర నిడివి కొంచెం తక్కువగా ఉంటుందని వినికిడి. పవన్ 25 రోజుల్లోపే డేట్స్ కేటాయించారట. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ విడుదలయ్యే సూచనలు కలవు. లేదా 2024 సంక్రాంతి కానుకగా విడుదల కావచ్చు. మరోవైపు పవన్ హరి హర వీరమల్లు షూట్ పూర్తి చేయాల్సి ఉంది. హరి హర వీరమల్లు షూట్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మాతగా ఉన్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా… పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.