
Hyderabad Traffic Police: అవసరమైన సమయం లో సరైన చికిత్స అందిస్తే కచ్చితంగా చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించగలరు అనే విషయం ఎన్నో సందర్భాలలో రుజువు అయ్యింది.మనిషి గుండె ఆగిపోయిన సమయం లో వెంటనే పసిగట్టి సీపీఆర్ సరైన పద్దతి లో చేస్తే ఆగిపోయిన గుండె మళ్ళీ తిరిగి కొట్టుకోవడం ప్రారంభిస్తుంది.గతం లో ఇలా బ్రతికినోళ్లని ఎంతోమందిని మనం చూసాము.రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక ట్రాఫిస్ పోలీస్ ఇలాగే చేసి ఒక మనిషి ప్రాణాలను కాపాడాడు.
దానికి సంబంధించిన లైవ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇక అసలు విషయానికి వస్తే రాజేంద్ర నగర్ అరంఘర్ చౌరస్తా లో బాలరాజు అనే వ్యక్తికీ గుండెపోటు వచ్చి అక్కడిక్కక్కడే కుప్పకూలిపోయాడు.ఇది గమనించిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ వెంటనే అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడాడు.
దాదాపుగా చనిపోయాడు అని అనుకున్న బాలరాజు అనే వ్యక్తికి సీపీఆర్ చెయ్యడం వల్ల వెంటనే ఊపిరి రావడం ని చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు.ఇక దానికి సంబంధించిన వీడియో ని చూసిన ప్రేక్షకులు లైవ్ గా ఆ ట్రాఫిస్ పోలీస్ బాలరాజు అనే వ్యక్తి చావుబ్రతుకుల మధ్య నుండి కోలుకోవడం ని చూసి నోరెళ్లబెట్టారు.చొరవ తీసుకొని అతని ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ పై నెటిజెన్స్ సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఆ ట్రాఫిక్ పోలీస్ ఆ యువకుడి ప్రాణాలను ఎలా కాపాడాడో మీరు కూడా ఈ క్రింది వీడియో లో చూసేయండి.
ప్రాణం కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్
రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటు రాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సిపిఆర్ చేసి ప్రాణం కాపాడాడు. ఇప్పుడు బాలరాజు సురక్షితంగా ఉన్నారు. pic.twitter.com/vDH3zdd6gm
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 24, 2023