Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అతిపెద్ద స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పాత సినిమాలను కూడా ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు. జల్సా, ఖుషి చిత్రాలు రీ రిలీజ్ చేయగా రికార్డు వసూళ్లు సాధించాయి. అయితే పవన్ ఫ్యాన్స్ పాన్ ఇండియా మూవీ కల నెరవేరలేదు. ఫ్యాన్స్ ఎప్పటి నుండో భారీ మల్టీ లాంగ్వేజ్ మూవీ చేయాలని కోరుకుంటున్నారు. వారి నిరీక్షణకు సమాధానంగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. సౌత్ టు నార్త్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో హరి హర వీరమల్లు రూపొందుతుంది. మొఘలుల కాలం నాటి బందిపోటు కథే హరి హర వీరమల్లు.

మొఘలులు చరిత్ర యూనివర్సల్ సబ్జెక్టు కావడంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చే సూచనలున్నాయి. పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగించనున్నాయి. ఒక సరికొత్త పవన్ హరి హర వీరమల్లు మూవీతో సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కృతం కానున్నారు. పెద్దలను కొట్టి పేదలకు పెట్టే బందిపోటుగా అలరించనున్నారు.
కాగా హరి హర వీరమల్లు సెట్స్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ బయటకు వచ్చింది. ఎర్ర చొక్కా, నల్లని పంచె కట్టుల్లో 16వ శతాబ్దపు వింటేజ్ గెటప్ లో వీరుడిగా పవన్ గెటప్ అదిరిపోయింది. నేడు హరి హర వీరమల్లు నిర్మాత ఏ ఎం రత్నం పుట్టినరోజు. ఆయన బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్విట్టర్ లో హరి హర వీరమల్లు సెట్స్ నుండి పవన్ లుక్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ ఓ వైరల్ గా మారాయి. ఇక పవన్ లుక్ చూసిన ఫ్యాన్స్… బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమంటున్నారు.

దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న హరి హర వీరమల్లు షూట్ చివరి దశకు చేరుకుంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ మొదలుకానుంది. విడుదల తేదీపై యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ఓ జి, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన చిత్రాల జాబితాలో ఉన్నాయి.
Multi-talented and aspirational journey of perseverance, grit & self-confidence. We love your caring nature and humbleness, @AMRathnamOfl sir. Wish you a very Happy Birthday! ✨
– Team @HHVMFilm pic.twitter.com/KO1S6zJnVI
— Hari Hara Veera Mallu (@HHVMFilm) February 4, 2023