Ustad Bhagat Singh : హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి ఫ్యాన్స్ కి సెన్సేషనల్ అప్డేట్

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కి ఫోన్ చేసి మే 16 నుండి డేట్స్ ఇస్తాను, రెండవ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకోండి అని చెప్పాడట. దీంతో హరీష్ శంకర్ రెండవ షెడ్యూల్ కి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నాడట.

Written By: NARESH, Updated On : May 4, 2023 10:17 pm
Follow us on

Ustad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఇటీవలే ఒక సినిమాని పూర్తి చేసాడు పవన్ కళ్యాణ్.ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం జులై 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఈ సినిమాతో పాటుగా డైరెక్టర్ క్రిష్ తో ‘హరి హర వీరమల్లు’, సుజిత్ తో #OG మరియు హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఆయన #OG మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.ఏప్రిల్ 15 వ తారీఖున ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 8 వరకు సాగనుంది.ఈ సినిమా షెడ్యూల్ పూర్తి అవ్వగానే ఆయన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటాడని అందరూ అనుకున్నారు.సోషల్ మీడియా లో వచ్చిన వార్త కూడా అదే.

కాని కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కి ఫోన్ చేసి మే 16 నుండి డేట్స్ ఇస్తాను, రెండవ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకోండి అని చెప్పాడట. దీంతో హరీష్ శంకర్ రెండవ షెడ్యూల్ కి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నాడట.అంతే కాదు ఈ నెల 11 వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో కూడా విడుదల కాబోతుంది.ఒక పక్క ప్రీ క్లైమాక్స్ షెడ్యూల్ కోసం నిర్మాత AM రత్నం సారధి స్టూడియోస్ లో భారీ సెట్స్ వేసాడట. పవన్ కళ్యాణ్ #OG రెండు షెడ్యూల్స్ పూర్తి అవ్వగానే ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి డేట్స్ ఇస్తానని నిర్మాతకి చెప్పాడట.

ఈ విషయం సోషల్ మీడియా లో కూడా లీక్ అయ్యింది, కాని ఇంతలోపే ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి డేట్స్ కేటాయించడంతో అభిమానులు గందరగోళం లో ఉన్నారు.అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో పవన్ కళ్యాణ్ తో పాటు చేసే ఆర్టిస్టుల డేట్స్ సమస్య అవ్వడం తో ముందుగా ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది.