https://oktelugu.com/

Ramana Gogula : అప్పుల పాలైన పవన్ కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఇంత దీనమైన స్థితిలో ఉన్నాడా!

Ramana Gogula : సినిమా రంగం అంటే కొంతమందికి పిచ్చి.. జీవితాలను కూడా ఫణంగా పెట్టి కృష్ణనగర్ చుట్టూ తిరుగుతారు..కొంతమందికి అదృష్టం కలిసొచ్చి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ లను చూడగా, మరికొంత మంది ఇప్పటికీ కృష్ణనగర్ చుట్టూనే తిరుగుతున్నారు..అలా కెరీర్ ని రిస్క్ లో పెట్టి ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ ని సాధించిన అతి తక్కువమంది లో ఒకరు సంగీత దర్శకుడు రమణ గోగుల..ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందు ఈయన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2022 / 09:13 PM IST
    Follow us on

    Ramana Gogula : సినిమా రంగం అంటే కొంతమందికి పిచ్చి.. జీవితాలను కూడా ఫణంగా పెట్టి కృష్ణనగర్ చుట్టూ తిరుగుతారు..కొంతమందికి అదృష్టం కలిసొచ్చి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ లను చూడగా, మరికొంత మంది ఇప్పటికీ కృష్ణనగర్ చుట్టూనే తిరుగుతున్నారు..అలా కెరీర్ ని రిస్క్ లో పెట్టి ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ ని సాధించిన అతి తక్కువమంది లో ఒకరు సంగీత దర్శకుడు రమణ గోగుల..ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందు ఈయన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

     

    అమెరికాలో ఏంఎస్ చేసి కొన్ని సంవత్సరాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి, ఆ తర్వాత ఆయనే సొంతం గా ఒక కంపెనీ పెట్టుకున్నాడు.. మంచి జీవితం అనుభవిస్తున్నా కూడా అతనికి మొదటి నుండి సంగీతం అంటే పిచ్చి.. సినిమాల్లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా రాణించాలని కలలు కనేవాడట..ఆ కలల్ని నెరవేర్చుకోవడం కోసం ఇండియా కి తిరిగి వచ్చాడు..అయితే అవకాశాలు అంత తేలికగా ఎవరికీ రావు..మనమే వాటిని సాధించాలి.

    ఆ క్రమంలోనే చేతికి వచ్చిన ప్రతీ అవకాశాన్ని సినిమాల్లో ఛాన్స్ సంపాదించడం కోసం మెట్లుగా మార్చుకున్నాడు.. తొలుత మిథి రిథమ్స్ అనే బ్యాండ్ తో కలిసి పని చేసాడు.. ఆ క్రమంలోనే ఇండీ పాప్ స్టూడియో వారికి ఒక ఆల్బం తయారు చేసి ఇచ్చాడు.. అది బాగా హిట్ అవ్వడం తో నలుగురి దృష్టిలో పడ్డాడు రమణ గోగుల..అలా తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో తో పని చేసే అవకాశం దక్కింది.. ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రానికి తన దగ్గరున్న టాలెంట్ ని మొత్తం ఉపయోగించి అద్భుతమైన సంగీతం అందించాడు.

    ఈ చిత్రం లోని పాటలు అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపేసాయి..ఆ తర్వాత తమ్ముడు , బద్రి , జానీ , అన్నవరం , యోగి , లక్ష్మీ, వాసు మరియు యువరాజు ఇలా ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ని అందించాడు..ఇక్కడ మాత్రమే కాదు తమిళం మరియు కన్నడ లో కూడా ఆయన ఎన్నో సినిమాలు చేసాడు..డబ్బులు కూడా బాగానే సంపాదించాడు.

    ఆ వచ్చిన డబ్బులతో సుమంత్ తో ‘బోణి’ అనే సినిమా తీసాడు.. భారీ ఫ్లాప్ అవ్వడంతో నష్టాలు బాగా వచ్చాయి.. ఆ నష్టాలను ఎలా అయిన పూడవాలనే ఉద్దేశ్యంతో ప్రముఖ డైరెక్టర్ తేజతో 1000 అబద్దాలు అనే మరో సినిమా నిర్మించాడు.. ఇది కూడా భారీ డిజాస్టర్ అవ్వడంతో అప్పులపాలయ్యాడు.. చాలా కాలం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నాడు.. అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ అమెరికాకి తిరుగు ప్రయాణమై మళ్ళీ సాఫ్ట్ కంపెనీని ఏర్పాటు చేసి బాగా సంపాదిస్తున్నాడు.