
OG Making video : సరైన కంటెంట్ పడితే పవన్ కళ్యాణ్ పవర్ ని తట్టుకోవడం బాక్స్ ఆఫీస్ వల్ల కాదు అని ట్రేడ్ విశ్లేషకులు ఆయనకీ ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు.అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, ప్రతీ స్టార్ హీరో కి రికార్డ్స్ పెట్టాలంటే కచ్చితంగా స్టార్ డైరెక్టర్ ఉండాలి.కానీ ఈయన మాత్రం ఇన్నేళ్ల తన కెరీర్ లో తన బ్రాండ్ పవర్ నే నమ్ముకున్నాడు, తన పేరుతో యుఫొరియా క్రియేట్ చేసుకున్నాడు.
ఈయన సినిమా వస్తుందంటే చాలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు థియేటర్స్ కి బారులు తీస్తారు.ఇలాంటి స్టార్ స్టేటస్ అందరికీ అంత తేలికగా రాదు.అయితే గత కొంత కాలం నుండి ఆయన రీమేక్ సినిమాలు చేస్తూ వస్తుండడం వల్ల అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.అందరూ హీరోలందరూ సరికొత్త కథలతో వెయ్యి కోట్ల రూపాయిల ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటూ ఉంటే, మా హీరో ఇంత స్టార్ స్టేటస్ పెట్టుకొని ఇంకా రీమక్స్ చేస్తున్నాడు అని భాదపడుతుండే వారు.
ఇక వాళ్ళ ఎదురు చూపులకు తెర దించుతూ ఆయన ప్రస్తుతం చెయ్యబోతున్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్.అందులో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది #OG గురించి.కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా షూటింగ్ నేడు ముంబై లో ప్రారంభం అయ్యింది.ఈ సందర్భంగా మూవీ యూనిట్ విడుదల చేసిన ఒక స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది.#OG సినిమా ఎలా ఉండబోతుందో ఒక చిన్న గ్లిమ్స్ చూపించాడు డైరెక్టర్ సుజిత్.

క్రేజీ ఐడియా తో అతను చేసిన ఈ వీడియో కి కేవలం ఫ్యాన్స్ నుండే కాదు, ఇతర హీరోల అభిమానుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.కేవలం షూటింగ్ ప్రారంభం అయ్యింది అనే అప్డేట్ తోనే సోషల్ మీడియా ని ఈ రేంజ్ లో షేక్ చేస్తే, రేపు సినిమా విడుదలై గ్రాండ్ హిట్ అయితే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కొల్లగొడుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.