
KTR – Mallareddy : తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి అనగానే పిచ్చ కామెడి గుర్తొస్తుంది. ఆయన ఏం చేసినా ట్రెండింగ్.. మల్లారెడ్డి కూడా ఇప్పుడు ఎక్కడి వెళ్లినా ఇదే మాట చెప్తున్నాడు. ఇక మల్లన్న డైలాగ్ ‘కష్టపడ్డ.. పాలు పోసిన.. పేపరేసి.. కాలేజీలు కట్టిన.. పైకి వచ్చిన’ ఈ డైలాగైతే ఇగ ఫుల్లు ట్రెండింగ్‌లో ఉంది. అయితే తాజాగా ఆయన గురించి ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బర్రెలనే కంట్రోల్ చేసి గీల్లో లెక్కా..
హైదరాబాద్‌లో అభివృద్ధిపనుల ప్రారంభోత్సవంలో మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్ పాల్గొన్నారు. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిగాయి. అయితే అక్కడ మంత్రి కేటీఆర్‌తో ఫొటోలు దిగేందుకు కార్యకర్తలు, నేతలు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. పక్కనే ఉన్న మంత్రి మల్లారెడ్డి నెట్టుకుంటున్న నేతలను ఒక్కసారిగా వెనక్కు నెట్టేశాడు.. ఈ సందర్భంగా కేటీఆర్.. వాళ్లంటే నేతలు తోసుకుంటారు.. నువ్వేందే అని అడిగాడట. దానికి మల్లారెడ్డి ‘నేను బర్రెలనే కంట్రోల్ చేసి.. గీల్లో లెక్కనా’ అన్నడంట. ఇది కార్యక్రమం అనంతరం నిర్వహించిన సభలో కేటీఆరే స్వయంగా చెప్పారు. అయితే.. సభాప్రాంగణం అంతా ఒక్కసారిగా నవ్వారు.
తిట్టిండా.. పొగిడిండా..
అయితే మంత్రి మల్లారెడ్డి గురించి చెప్పినంతసేపు కేటీఆర్‌పాటు వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు బాగా నవ్వారు. కింద కూర్చున్న కార్యకర్తలు కూడా పగలబడి నవ్వారు. కానీ, తర్వాత ఆలోచించి మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్ మనల్ని పొడిడారా, తిట్టారా అని ఆలోచిస్తున్నారట. బాగా ఆలోచిస్తే మల్లారెడ్డి చెప్పినదాంట్లో కార్యకర్తలు బర్రెల కంటే అధ్వానం అనే అర్థం వస్తుంది.
నెట్టింట్లో వైరల్..
ఇప్పుడు కేటీఆర్ చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి గురించి హాస్యం పండించేందుకు కేటీఆర్ ఆ మాటలు చెప్పి ఉండొచ్చు కానీ, మల్లారెడ్డి మాటలు మాత్రం కార్యకర్తలు నొచ్చుకునేలా ఉన్నాయి. బర్రెలకన్నా కార్యకర్తలు అధ్వానం అన్నట్లు మంత్రి మాట్లాడారు. ఇక నెటిజన్లతోపాటు, కార్యకర్తలు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. కొందరేమే కామెడీ పీస్, కామెడిగా తీసుకోవాలని పోస్టులు పెడుతుంటే.. కార్యకర్తలను బర్రెలకంటే హీనంగా చూస్తారా.. బర్రెలతో పోలుస్తారా అని కామెంట్స్ పెడుతున్నారు.