
Renu Desai: రేణు దేశాయ్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె సాగరతీరంలో జలకాలాడారు. రేణు దేశాయ్ లోని ఈ ఊహించని యాంగిల్ అభిమానులకు సరికొత్తగా తోచింది. బద్రి మూవీతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన రేణు దేశాయ్ వివాహం అనంతరం యాక్టింగ్ మానేశారు. బద్రితో పాటు రేణు ఓ తమిళ చిత్రం చేశారంతే. రెండు దశాబ్దాల తర్వాత రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు.
గత ఏడాది టైగర్ నాగేశ్వరరావు మూవీ నుండి రేణు దేశాయ్ లుక్ విడుదల చేశారు. తెల్ల చీరలో నిరాడంబరంగా రేణు లుక్ ఆసక్తి కలిగించింది. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఇది తెరకెక్కింది. దసరా కానుకగా విడుదల కానుంది. రేణు దేశాయ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. త్వరలో వారి కోరిక తీరనుంది. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ లో రేణు దేశాయ్ నటించే అవకాశం కలదు. అవి చర్చల దశలో ఉన్నాయి.
దర్శకురాలిగా చిత్రాలు తెరకెక్కించే ఆలోచన ఉన్నట్లు రేణు దేశాయ్ గతంలో చెప్పారు. కెరీర్ కోసం ఆమె పూణే నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో రేణు దేశాయ్ హైదరాబాద్ లో ఉంటున్నారు. ఖాళీ సమయం దొరికితే రేణు దేశాయ్ నచ్చిన ప్రదేశాలకు చెక్కేస్తారు. సమ్మర్ వెకేషన్ లో భాగంగా రేణు దేశాయ్ సాగర తీరానికి వెళ్లారు. సముద్ర అలల మధ్య జలకాలాడుతున్న ఆమె వీడియో వైరల్ అవుతుంది.

నేను సముద్ర అలల ధాటికి అల్లాడిపోతుంటే రూత్ లెస్ పాపరాజి(ఆద్య) వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తుందని… ఆ వీడియోకి రేణు దేశాయ్ కామెంట్ జోడించారు. రేణు దేశాయ్ వీడియో వైరల్ గా మారింది. గతంలో రేణు దేశాయ్ ని ఇలా చూడని ఆమె అభిమానులు డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలకు ఆర్ట్స్ నేర్పించారు. కొడుకు అకీరా నందన్ అద్భుతమైన పియానో ప్లేయర్. ఓ షార్ట్ ఫిల్మ్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మారాడు. ఇక ఆద్యకు ఫోటోగ్రఫీ, పెయింటింగ్ అంటే ఇష్టం అట.
View this post on Instagram