Pawan Kalyan-Sujeeth movie : పవన్ కళ్యాణ్ నేడు కొత్త మూవీ ప్రకటన చేశారు. ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించింది. పలు ఆసక్తికర విషయాలతో ఒక పజిల్ లా కాన్సెప్ట్ పోస్టర్ డిజైన్ చేశారు. ఇక పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా, పోస్టర్ ని నిశితంగా పరిశీలిస్తూ ఆధారాలు బయటకు లాగుతున్నారు. పవన్-కళ్యాణ్ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ లో దర్శకుడు సుజీత్ స్టోరీకి సంబంధించి ఏం ఆధారాలిచ్చాడో చూద్దాం…

పోస్టర్లో ఫస్ట్ ఆకర్షించిన విషయం #OG. హ్యాష్ ఓ జి అంటే అర్థం ఏమిటీ? అనేది పవన్ అభిమానుల బుర్రలు హీటెక్కించింది. ప్రాధమికంగా ఓ జి అంటే… ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అన్న ప్రచారం జరుగుతుంది. తర్వాత జపాన్ భాషలో ఒక కోట్ రాసి ఉంది. దానర్థం… ఫైర్ స్ట్రోమ్ ఈజ్ కమింగ్. నిప్పు తుఫాను రాబోతుందని. పోస్టర్ లో లెఫ్ట్ సైడ్ ఎత్తైన బుద్ధుని విగ్రహం ఉంది. అది జపాన్ దేశంలో గల ఫేమస్ బుద్ధుని విగ్రహం. మరో హింట్… సూర్యుడిని తలపించేలా ఎర్రని గోళాకారం కూడా ఉంది. జపాన్ ఫ్లాగ్ లో మనం ఎర్రని పెద్ద చుక్క ఉంటుంది.
ఇక పోస్టర్ రైట్ సైడ్ లో ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా చూడవచ్చు. అటువైపుకు తిరిగి ఏదో ఆలోచిస్తునట్లున్న పవన్ నీడ మాత్రం గన్ ఆకారంలో చూపించారు.ఇవి దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్ర పోస్టర్ లో పొందుపరిచిన అంశాలు. మొత్తంగా చూస్తే ఇది ఒక గ్యాంగ్ స్టర్ స్టోరీ. అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కే చిత్రం. జపాన్, ముంబై దేశాలు కథలో ప్రధానంగా ఉంటాయని తెలుస్తుంది. కాబట్టి సుజీత్ హీరో పవన్ కళ్యాణ్ ని సరికొత్తగా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించనున్నాడని స్పష్టం అవుతుంది.
మొదట విజయ్ హిట్ మూవీ తేరీ రీమేక్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే కాన్సెప్ట్ పోస్టర్ పరిశీలించాక ఇది స్ట్రెయిట్ మూవీ అని క్లారిటీ వచ్చేసింది. పాన్ ఇండియా చిత్రంగా భారీ ఎత్తున నిర్మించే సూచనలు కలవు. సుజీత్ అనౌన్స్మెంట్ పోస్టర్ లోనే తన మార్క్ చూపించాడు. సినిమాపై అంచనాలు పెంచేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పూర్తి చేస్తున్నారు. మరి సుజీత్ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.