Balakrishna- Pawan Kalyan: సంక్రాంతి వచ్చేస్తుంది..బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోలు తమ సినిమాలతో పోటీ పడేందుకు సిద్ధం గా ఉన్నారు..మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ తో , నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో తలపడేందుకు రెడీ అయ్యారు..వీరితో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ మరియు అజిత్ హీరో గా నటించిన ‘తెగింపు’ సినిమాలు కూడా పోటీకి రానున్నాయి.

సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా చిరంజీవి మరియు బాలయ్య సినిమాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు..ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 200 కోట్ల రూపాయలకు జరిగింది..త్వరలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రొమోషన్స్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగనున్నాయి..’వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో, ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో జరగనున్నాయి.
అయితే ‘వీరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో గత కొద్దిరోజుల నుండి ప్రచారం సాగుతూనే ఉంది..పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి..పవన్ కళ్యాణ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మైత్రి మూవీ మేకర్స్ ఆహ్వానించిన విషయం వాస్తవమే..అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే మా మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంటుంది..అన్నయ్య సినిమా కూడా ఉంది కదా అని పవన్ కళ్యాణ్ చివరి నిమిషం లో రాలేనని చెప్పాడట.

ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..మరోపక్క అమెరికా లో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య బాలయ్య అభిమానుల మధ్య భారీ ఎత్తున గొడవలు జరిగాయి..మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ న్యూస్ ని బాగా ప్రచారం చేసింది..ఈ గొడవ కూడా పవన్ కళ్యాణ్ రాకపోతున్నందుకు కారణమని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మాట.