Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Okka Chance Please: పవన్ ఒక్క ఛాన్స్.. షేక్ అవుతున్న వైసీపీ

Pawan Kalyan- Okka Chance Please: పవన్ ఒక్క ఛాన్స్.. షేక్ అవుతున్న వైసీపీ

Pawan Kalyan- Okka Chance Please: ‘ఒక్క చాన్స్’ అన్న మాట ఎంతబాగా వర్కవుట్ అయ్యిందో వైసీపీ నేతలకు తెలిసింతగా మరెవరికీ తెలియదు. ఆ ఒక్క మాటతోనే తమ అధినేత జగన్ సీఎం అయిపోయారు. తాము ఎమ్మెల్యేలం అయ్యామన్న విషయం వారిందరికీ తెలుసు. బలవంతులైన ప్రత్యర్థులను సైతం చిత్తుచేసిన వారు సైతం అది మా గెలుపుగా చూడలేదు. అదంతా ‘ఒక్క చాన్స్’ మాట పుణ్యమేనని ఇప్పటికీ చెబుతుంటారు. ఇప్పుడు అదే ‘ఒక్క చాన్స్’ అన్న మాట ప్రత్యర్థి నోటి నుంచి వచ్చేసరికి వారి నోట మాట రావడంలేదు. నాడు తమ అధినేత ఊరూరా తిరిగి ఒకేఒక చాన్స్ అన్నందుకు ప్రజలు అర్ధం చేసుకుని అధికారం అప్పగించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అప్పటికే ఆయనపై అవినీతి ఆరోపణలున్నా పట్టించుకోకుండా ప్రజలు పట్టం కట్టేశారు. అటువంటిది క్లీన్ ఇమేజ్ తో తనకు ఒక చాన్సివ్వాలని జనసేన అధినేత పవన్ కోరుతుండడంతో అధికార పార్టీ నేతలను కలవరపెడుతోంది. ప్రజలు తప్పకుండా చాన్స్ ఇచ్చి చూస్తారని భావిస్తుండడమే అందుకు కారణం.

Pawan Kalyan- Okka Chance Please
Pawan Kalyan

గత ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఏవైనా కుట్రలు, కుతంత్రలు జరిగితే విపక్షంపైనే జరగాలి. కానీ ఏపీలో మాత్రం అంతా రివర్స్. విపక్షమే పాలక పక్షంగా మారి అప్పటి ప్రభుత్వంపై విష ప్రచారం చేసింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు ఫలించాయి. ప్రజలను కుల, మత, వర్గాలుగా విభజించడంలో పీకే సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకతను వైసీపీ వైపు కన్వెర్ట్ చేయగలిగారు. ప్రజల మైండ్ సెట్ ను మార్చేలా పేరు మోసిన నేపథ్య గాయనీ గాయకులతో వైసీపీకి మద్దగా పాటలు, గోడలపై రాతలు ఇలా ఒకటేమిటి.. అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. చివరకు జగన్ పాదయాత్ర సమయంలో విద్యుత్ స్తంభాలపై రంగులు సైతం వేశారు. కానీ నాటి టీడీపీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. అటు ‘ఒక్క చాన్స్’ అన్న స్లోగన్ కూడా బాగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. దాని ఫలితమే వైసీపీ అంతులేని విజయం. తాము గెలుపొందుతామని భావించని నేతలు సైతం ఎమ్మెల్యేలు అయిపోవడం 2019 ఎన్నికల ప్రత్యేకతగా చెప్పొచ్చు.

అయితే ప్రస్తుత సిట్యువేషన్ లో జనసేనకు ఎటువంటి రాజకీయ సలహాదారులు లేకున్నా పవన్ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గతానికి భిన్నంగా పరిణితి కనబరుస్తున్నారు. ఈ కోవలో జనసేనకు ఒక చాన్సివ్వాలని కోరుతున్నారు. అవినీతిలేని సుపరిపాలన అందిస్తామని చెబుతున్నారు. అలాగని వైసీపీలాగ అలవికాని హామీలు ఇవ్వడం లేదు, పారదర్శకంగా, వాస్తవానికి దగ్గరగానే మాట్లాడుతున్నారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దడం, పాడైన ఏపీ భవిష్యత్ ను గాడిలో పెట్టడం, నిరుద్యోగం నిర్మూలన, సాగు ప్రోత్సాహం, అన్నివర్గాల జీవన ప్రమాణాలు పెంచడం వంటి వాస్తవిక హామీలను మాత్రమే పవన్ ప్రజలకు ఇస్తున్నారు. అయితే పవన్ తాజా ‘ఒక్క చాన్స్’ ప్రకటన మాత్రం ప్రజల్లోకి బలంగా వెళుతున్న సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పుడంతటా ఇదే చర్చనీయాంశమవుతోంది.

Pawan Kalyan- Okka Chance Please
Pawan Kalyan

పవన్ తాజా ప్రకటన చూసి వైసీపీ బిత్తరపోతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. గత ఎన్నికల్లోతన విజయానికి కారణమైన స్లోగన్ అదే కావడంతో జగన్ కలవరపాటకు గురవుతున్నారు. పవన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. అందుకే గడపగడపకు వెళ్లి ఇంతకంటే సుపరిపాలన ఎక్కడా లేదని చెప్పాలని ఎమ్మెల్యేలు, మంత్రులను పురమాయిస్తున్నారు. అయితే ఇదంతా ‘సెకెండ్ చాన్స్’ అన్న నినాదం కోసమేనన్న టాక్ నడుస్తోంది. పవన్ ఎప్పుడైతే ఒక్క చాన్స్ స్లోగన్ ఇచ్చారో.. అప్పుడే జగన్ ఏం చేయాలో అన్నదానిపై తన స్ట్రాటజీస్టులతో ఆలోచించారు. రెండో చాన్స్ స్లోగన్ కు పదును పెట్టారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular