Pawan Kalyan- CM Jagan: రణస్థలం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ సమర శంఖం పూరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు శ్రీకాకుళంలోని రణస్థలం లో ‘యువ శక్తి’ అనే భారీ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా తరలి వచ్చారు.. మధ్యలో పోలీసులు సభకి వచ్చే కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అభిమానుల ప్రవాహాన్ని ఆపడం లో విఫలం అయ్యారు..ఇక ఈ సభ లో యువత మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి.

నిరుద్యోగులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికెషన్స్ రాక ఇబ్బంది పడుతున్న ఎంతోమంది యువతకి తమ గళం వినిపించేందుకు వేదికలాగా మారింది ఈ సభ.. అనేక అంశాలను టచ్ చేస్తూ సాగిన ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది..ముఖ్యంగా సీఎం జగన్ ని ఉద్దిసిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
సీఎం జగన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా ‘దత్తపుత్రుడు’ అని సంబోధించడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా చిరాకు కలిగించేది.. పవన్ కళ్యాణ్ కూడా నేడు ఆ చిరాకుని చూపిస్తూ సీఎం కి కౌంటర్ ఇచ్చాడు..

పవన్ మాట్లాడుతూ ‘మాటికొస్తే ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి నన్ను ‘దత్తపుత్రుడు’ అని అంటూ ఉంటాడు..నోటి దాకా వస్తుంది బూతులు మాట్లాడడానికి..కానీ సంస్కారం అడ్డు వచ్చి ఆగుతుంటాను..కానీ ఈ సందర్భంగా ఆ మూడు ముక్కల ముఖ్యమంత్రికి ఒక్కటే చెప్తున్నాను ..ఇదిగో మూడు ముక్కల ముఖ్యమంత్రి..నేను నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి లాంటోడిని ఎదురుకున్నోడిని..బహిరంగంగా పంచెలు ఊడదీసి తరిమికొట్టండి అంటూ పిలుపుని ఇచ్చినోడిని నేను..అలా అన్నందుకు మీ మనుషులు నేను వచ్చే సభల మీటింగ్స్ ని కూల్చివేశారు..నా కుటుంబానికి బెదిరింపులు ఇచ్చారు..అవన్నీ చూసేసి వచ్చిన వాడిని నేను..నా దగ్గర నీ కుప్పిగంతులు పనికిరావు’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది..

ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇవ్వగానే క్యూలు కట్టి ఆయనమీద నోర్లు పారేసుకుని మంత్రులు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి