Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధం అయిపోతున్నాడు.. ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క క్రియాశీలక రాజకీయాల్లో ముఖ్య భూమికను పోషిస్తూ ఎప్పటికప్పుడు ఆయన ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాడు.. గడిచిన రెండు మూడు నెలల్లో జనసేన పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఉత్తరాంధ్ర ప్రాంత పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ నాయకులపై వైసీపీ పార్టీ పోలీసుల ద్వారా చేయించిన దౌర్జన్యాలు ఆ పార్టీ కి మైలేజ్ ఇచ్చేలా చేసింది.

ఇక ఆ తర్వాత ఇప్పటం గ్రామాన్ని వైసీపీ పార్టీ కూల్చివేయడం..ఆ గ్రామా ప్రజలకు పవన్ కళ్యాణ్ నేను అండగా ఉంటాను అని ముందుకి వచ్చి నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయిల సహాయం చేయడం వంటివి పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో నమ్మకం కలిగించేలా చేసింది..నాయకుడు అంటే ఇలా ఉండాలి అని అందరి నోట చెప్పించేలా చేసాడు పవన్ కళ్యాణ్.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 జిల్లాలోనూ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు..అక్టోబర్ నెల నుండే ప్రారంభం అవ్వాల్సిన ఈ యాత్ర కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య వాయిదా వేసాడు..అయితే నేడు ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్షేషనల్ గా మారింది.

‘ఎన్నికల పోరుకి ‘వారాహి’ సిద్ధం అయ్యింది’ అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో వేసిన ఒక వీడియోకి నిమిషాల వ్యవధిలోనే వేల సంఖ్యలో రీట్వీట్స్ వచ్చాయి..ఇక్కడ ‘వారాహి’ అంటే బస్సు పేరు.. తన పర్యటన కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ వాహనం ని తయారు చేయించుకున్నాడు..ఈ బస్సులోనే ఆయన ఏడాది పాటు రాష్ట్రం లో విరామం లో లేకుండా పర్యటించబోతున్నాడు..ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులను తీసుకొస్తుందో చూడాలి.
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022