https://oktelugu.com/

Pawan Kalyan : గూగుల్ ట్రెండ్స్ లో నెంబర్ 1 గా పవన్ కళ్యాణ్..దరిదాపుల్లో మరో హీరో లేరు..నరేంద్ర మోడీ కూడా పవన్ తర్వాతే!

ఇండియా వైడ్ గా నెటిజెన్స్ ఆ సమయంలో ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో, వాళ్ళ గురించి ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. అలా గూగుల్ లో ఈ ఏడాది అత్యధిక శాతం మంది మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి వెతికినట్టు తెలుస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 10, 2024 / 07:55 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan : సోషల్ మీడియా ని ఈ కాలం లో ఉపయోగించని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. మన రెగ్యులర్ జీవితంలో సోషల్ మీడియా లో అనేది ఒక అంతర్భాగం అయిపోయింది. సినిమాలు, వాణిజ్యం, ఆరోగ్యం, జనరల్ వార్తలు ఇలా ఒక్కటా రెండా..ఎన్నో రకాల వార్తలను చూసేందుకు జనాలు ఈమధ్య టీవీ చానెల్స్, న్యూస్ పేపర్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియా నే ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా ఎంటర్టైన్మెంట్ వంటివి కూడా సోషల్ మీడియా ద్వారా గట్టిగానే దొరుకుంటుంది. అయితే సోషల్ మీడియా లో నిత్యం మనం ఎవరో ఒకరి గురించి వెతుకుతూ ఉంటాము. ఇండియా వైడ్ గా నెటిజెన్స్ ఆ సమయంలో ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో, వాళ్ళ గురించి ఎక్కువగా వెతుకుతూ ఉంటారు. అలా గూగుల్ లో ఈ ఏడాది అత్యధిక శాతం మంది మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి వెతికినట్టు తెలుస్తుంది.

    సినిమా, రాజకీయ విభాగాలను కలిపి చూస్తే గూగుల్ ట్రెండ్స్ లో పవన్ కళ్యాణ్ అందరికంటే నెంబర్ 1 స్థానం లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆయన స్థాపించిన జనసేన పార్టీ నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో గెలవడం దేశవ్యాప్తంగా సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. అదే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పవన్ కళ్యాణ్ ని పార్లమెంట్ హాల్ లో తుఫాన్ అని పిలవడం, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అనే నినాదం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందడంతో పాటు, సనాతన ధర్మం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రేంజ్ లో వైరల్ అవ్వడం, అదే విధంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ కూటమి సంచలన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎక్కువగా ఉండడం వంటివి ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇక రీసెంట్ గా సీజ్ ది షిప్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యాయి.

    దీంతో పవన్ కళ్యాణ్ ఎవరు..? ఇతని హిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి దేశం నలుమూలల ఉండే ప్రతీ ఒక్కరు గూగుల్ లో పవన్ కళ్యాణ్ కీ వర్డ్ తో వెతికారు. దీంతో ఆయన పేరు నెంబర్ 1 స్థానంలో వచ్చింది. క్రీడా రంగం, వ్యాపార రంగం కూడా కలిపితే పవన్ కళ్యాణ్ 5 స్థానంలో ఉన్నాడు. దీనిని బట్టీ పవన్ కళ్యాణ్ ని పాన్ ఇండియన్ పొలిటికల్ స్టార్ అని అనొచ్చు అంటూ సోషల్ మీడియా లో ఆయన వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక హీరోలు, రాజకీయ నాయకులూ క్యారగిరీ లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానం లో ఉండగా రెండవ స్థానంలో చిరాగ్ పశ్వాన్, మూడవ స్థానంలో నరేంద్ర మోడీ, నాల్గవ స్థానంలో చంద్రబాబు నాయుడు వంటి వారు ఉన్నారు.