https://oktelugu.com/

Viral Video : ఆర్ ఆర్ ఆర్ లో అల్లు అర్జున్.. ఈ వీడియో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది!

ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ కాకుండా అల్లు అర్జున్ నటించి ఉంటే ఎలా ఉండేది. భీమ్ కి పుష్పరాజ్ పాత్ర తోడైతే కథ ఎలా మారేది. మీకు చూడాలని ఉందా... అయితే ఈ వీడియో పై ఒక లుక్ వేయండి. పుష్పరాజ్-భీమ్ లతో కూడిన ఆర్ ఆర్ ఆర్ మూవీ వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : December 10, 2024 / 08:06 PM IST

    Pushparaj and Bheem goes viral.

    Follow us on

    Viral Video :  ఆర్ ఆర్ ఆర్ ఒక విజువల్ వండర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ఈ మల్టీస్టారర్ రూ. 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కైవసం చేసుకుంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అద్భుతం చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్… భీమ్, రామరాజు పాత్రల్లో నటించి మెప్పిచారు. ఆర్ ఆర్ ఆర్ లో ఈ రెండు పాత్రల స్వభావం బిన్నంగా ఉంటుంది. లక్ష్యం మాత్రమే ఒక్కటే.

    అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీలో పుష్పరాజ్ రోల్ ఉంటే ఎలా ఉంటుంది. భీమ్-పుష్పరాజ్ కాంబినేషన్ సీన్స్ పడితే ఎలా ఉంటాయి. ఈ ఆలోచన వచ్చిన ఒక మీమర్ చేసిన ఎడిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భీమ్ సీన్స్ కి పుష్పరాజ్ పాత్ర జోడించి ఎడిట్ చేశారు. ఈ మీమ్ కట్టిపడేస్తుంది. చాలా ఫన్నీగా ఉంది. నవ్వులు పూయిస్తోంది. చేసింది ఎవడో కానీ క్రియేటివిటీ అదిరింది అంటున్నారు.

    మరోవైపు పుష్ప 2 తో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ బడా హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. సౌత్ హీరో అల్లు అర్జున్ మూవీ.. లోకల్ స్టార్స్ చిత్రాల రికార్డ్స్ లేపేస్తుంది. కేవలం ఐదు రోజుల్లో పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 339 కోట్ల వసూళ్లు రాబట్టింది. వర్కింగ్ డే సోమవారం కూడా పెద్దగా ఫాల్ కనిపించలేదు. పుష్ప 2 హిందీ వసూళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అత్యంత వేగంగా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డులకు ఎక్కింది.

    వరల్డ్ వైడ్ పుష్ప 2 వసూళ్లు రూ. 1000 కోట్లకు చేరువయ్యాయి. ఫస్ట్ వీక్ కి పుష్ప 2 ఈ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం ఖాయం. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో నాలగవ చిత్రంగా పుష్ప 2 తెరకెక్కింది. రష్మిక మందాన హీరోయిన్. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక రోల్స్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.